బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు ప్రస్తుతం బాలీవుడ్ సహా యావత్ సినీరంగంలో ప్రకంపనలు రాజేస్తోంది. డ్రగ్స్ అలవాటు చేసిన తన కుమారుడ్ని నటి రియా ఛక్రవర్తి హత్య చేసిందని సుశాంత్ సింగ్ తండ్రి ఆరోపించిన నేపథ్యంలో ఎన్సీబీ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. రియా చక్రవర్తికి డ్రగ్స్ పెడ్లర్ తో సంబంధాలు వున్నాయన్న సమాచారం నేపథ్యంలో ఎన్సీబి వాటిపై నిషితంగా దర్యప్తు చేసి పలు అధారాలను కూడా సేకరించింది. ఈ క్రమంలో అమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో బాలీవుడ్ లో డ్రగ్స్ సంబంధాలు కలకలం రేపుతున్నాయి.
అయితే తాజాగా రియా చక్రవర్తి ఎన్సీబీ విచారణలో బాలీవుడ్ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లను కూడా ఎన్సీబి అధికారులకు ఎదుట వెలువరించింది. అయితే డ్రగ్స్ తో సంబంధం వున్న పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలలో ఇద్దరు ప్రముఖ హీరోయిన్ల పేరును కూడా వెలువరించిందని సమాచారం, వారిలో అటు బాలీవుడ్ సహా ఇటు టాలీవుడ్ లోనూ రాణిస్తున్న నటి పేరు కూడా వున్నట్లు వార్తలు వినిపించాయి, అయితే వారెవరా అన్న ఊహాగానాలతో ఇప్పటికే పలు మీడియా సంస్థలు ప్రచురించాయి. కాగా మీడియా సంస్థలు వెలువరించిన కథనాలు బాలీవుడ్ షక్ అవుతుంది. ఇక మరో నటి ఓ రాష్ట్రానికి నో టు డ్రగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వుంటూనే అభియోగాలు ఎదుర్కోంటోంది.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్, తెలుగులో పలు చిత్రాల్లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్, నటుడు రణ్‌వీర్ సింగ్ సన్నిహితురాలు, డిజైనర్ సిమోన్ ఖంబట్ట పేర్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర నో టు డ్రగ్స్ బ్రాండ్ అంబాసిడర్ గా వున్న రకుల్ పేరులో ఈ జాబితాలో వెల్లడి కావడంతో అమెపై విచారణకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి, వీరితోపాటు బాలీవుడ్ లోని పలువురిపై ఇప్పుడు ఎన్సీబీ నిఘాపెట్టినట్టు ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. విచారణలో భాగంగా రియా చక్రవర్తి ప్రత్యేకంగా పై పేర్లను వెల్లడించినట్టు టైమ్స్ నౌ తన కథనంలో పేర్కొంది. కాగా, తాను మాదకద్రవ్యాలు తీసుకోనని తొలుత చెప్పిన రియా.. ఆ తర్వాత తాను కూడా డ్రగ్స్ తీసుకుంటానని విచారణలో అంగీకరించినట్టు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more