జనసేన అధినేత, సినీనటుడు పవన్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలకు ఏర్పాట్లు చేస్తుండగా, విద్యుద్ఘాతానికి గురై ముగ్గురు అభిమానులు ప్రాణలు వదలడం పట్ల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని శాంతిపురం ప్రాంతంలో పవన్ కల్యాణ్ అభిమానులు ఆయన జన్మదిన వేడుకల ఏర్పాట్ల చేస్తుండగా విద్యుద్ఘాతానికి గురైన ముగ్గురు అభిమానులు మరణించారు. కాగా ఈ ఘటనలో మరో ముగ్గరు అభిమానులు తీవ్రంగా గాయపడి అసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన అల్లు అర్జున్.. బాధిత అభిమానుల కుటుంబాలకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు,
దీంతో పాటు బాధితు కుటుంబాలకు తన వంతుగా అర్థిక సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. కుప్పంలో జరిగిన విషాధ ఘటన తనను దిగ్ర్భాంతికి గురిచేసిందని అన్న ఆయన.. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన అభిమానులతో పాటు ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక బాధిత కుటుంబాలకు ప్రతీ ఒక్కరికి రూ.2 లక్షల మేర అర్థిక సాయాన్ని ప్రకటించారు. కాగా ఇప్పటికే ‘వకీల్ సాబ్’ చిత్ర యూనిట్ కూడా బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల సాయాన్ని ప్రకటించింది. కాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కూడా రూ. 2.50 లక్షల అర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
My Deep condolences . pic.twitter.com/3EN4Tri4za
— Allu Arjun (@alluarjun) September 2, 2020
(And get your daily news straight to your inbox)
Jan 25 | దర్శకధీరుడు, తెలుగు ప్రేక్షకులు అభిమానంతో జక్కనగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి.. బహుబలి చిత్రాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన అప్... Read more
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more