Ram Charan Mourns The Death Of Mega Fans బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తాం: మెగా పవర్ స్టార్

Ram charan mourns the death of pawan kalyans fans

Ram Charan, MegaPower Star, Mega Fans, Kuppam, Chittoor, pawan kalyan birthday, Shantipuram, Eletrocutuon, Flexi, Ram Charan photos, Ram Charan tweets, Ram Charan emotional tweets, Entertainment, telugu movies, movies, tollywood

The three fans of Pawan Kalyan lost their lives, while three others were left injured. Mega powerstar Ram Charan has mourned the death of Mega Fans and has also decided to donate Rs 2.5 lakhs each to the families of the deceased

బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తాం: మెగా పవర్ స్టార్

Posted: 09/02/2020 07:21 PM IST
Ram charan mourns the death of pawan kalyans fans

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల మృతి పట్ల నటుడు రామ్ చరణ్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మెగా అభిమానులతో పాటు అందరికీ ఈ సందర్భంగా ప్రాణమే ముఖ్యమని.. ఆ తరువాతే అభిమానం, ప్రేమానురాగాలని అన్నారు. ప్రాణమే లేనప్పుడు ప్రేమ, అభిమానాలు తావెక్కడ వుంటుందని అన్నారు. అభిమానులు ఎవరైనా.. ఎంతటి అభిమానం వున్నా.. వారి ప్రాణాలకు మించి ఏదీ కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని రామ్ చరణ్ సూచించారు. ఈ విషయాన్ని నిత్యం గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇక బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రతీ కుటుంబానికి రెండున్నర లక్షల రూపాయల అర్థిక సాయాన్ని అందించేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

కుప్పం దుర్ఘటనలోని బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు కూడా త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు. ఆయన ట్వీట్ సాగిందిలా.. ‘‘నిన్న కుప్పంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు అభిమానులు మృతి చెందారన్న వార్త తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. మీ ఆరోగ్యం, మీ ప్రాణంకంటే ఏదీ విలువైనది కాదు. మీరంతా ఇది ఎప్పుడూ గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని నా మనవి. ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని రామ్‌చరణ్‌ తెలిపారు.

మృతుల కుటుంబాలకు ‘వకీల్ సాబ్’ ఆర్థిక సాయం..

 

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ కడుతున్న సమయంలో విద్యుద్ఘాతం సంభవించి ముగ్గరు అభిమానులు రాజేంద్ర (31), సోమశేఖర్‌ (29), అరుణాచలం (20) మృతి చెందిన విషయం తెలిసిందే. అభిమానుల మృతి పట్ల ‘వకీల్‌సాబ్‌’ చిత్ర బృందం సంతాపం తెలిపింది. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థిక సాయం ప్రకటించింది. మృతి చెందిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.2లక్షలు అందించనున్నట్లు ట్విటర్‌ ద్వారా తెలిపింది. అదేవిధంగా ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. అభిమానులంతా తమ జీవితాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా చిత్ర బృందం సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles