Chiru pays tribute to NTR on his birth anniversary ఎన్టీఆర్ కు చిరంజీవి ఘననివాళి.. ఏ స్వీట్ మెమరీ..

Chiranjeevi pays tribute to ntr on his birth anniversary

legendary actor NTR, Megastar Chiranjeevi, Chiranjeevi pays tribute to NTR, NTR birth anniversary, Legendary Actro NTR, Megastar, Chiranjeevi, NTR, TDP Founder, Birth Anniversary, Twitter, Tollywood, Movies, Entertainment

Chiranjeevi paid tribute to NTR, via Twitter in honor of NTR Jayanti. Recalling his association with him on this occasion, he shared a photo of himself on social media.

ఎన్టీఆర్ కు చిరంజీవి ఘననివాళి.. ఏ స్వీట్ మెమరీ..

Posted: 05/29/2020 07:51 AM IST
Chiranjeevi pays tribute to ntr on his birth anniversary

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ బిరుదాంకితుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 98వ జయంతిని పురస్కరించుకుని పలువురు చిత్రసీమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నేతలు, నందమూరి కుటుంబసభ్యులు ఆయనకు ఘనంగా నివాళులు సమర్పించారు. నందమూరి కుటుంబసభ్యులు హైదరాబాద్‌ లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఘననివాళులు ఘటించారు. ఇక పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పించారు. ఈ జాబితాలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా స్వర్గీయ ఎన్టీఆర్ కి ఘనంగా నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ ను ఆయన జయంతి రోజున స్మరించుకుంటూ.. చిరంజీవి తన ట్విట్ఱర్ అకౌంట్లో తాజాగా ఓ పోస్టు పె్ట్టారు. ‘తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం.. తెలుగు నేల  గుండెల్లో  ఎన్నటికీ  చెదరని జ్ఞాపకం.. నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం.. వారితో కలిసి నటించడం నా అదృష్టం.. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ..’ అంటూ ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఆనాటి ఫోటోను కూడా ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ ఫోటో ఎన్టీఆర్ కు చిరంజీవి.. ఆ తరువాత చిరంజీవికి ఎన్టీఆర్ స్వీట్ తినిపిస్తున్న దృష్యాలు వున్నాయి. 1981లో చిరంజీవి, ఎన్టీఆర్ లు కలిసి ‘తిరుగులేని మనిషి’ అనే చిత్రంలో నటించిన విషయం తెలసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Legendary Actro NTR  Megastar  Chiranjeevi  NTR  TDP Founder  Birth Anniversary  Twitter  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh