President, PM, Politicans Mourns Rishi Kapoor's Death రోమాంటిక్ హీరోకు రాజకీయ ప్రముఖుల నివాళులు

Eternal romantic hero politicans mourns rishi kapoor s death

RishiKapoor, presidnet, PM Narendra Modi, rahul-gandhi, Uddhav Thackarey, sharad pawar, manmohan singh, Pawan Kalyan, Politicians, Bollywood

Tributes come in for the veteran Bollywood actor Rishi Kapoor who passed away at the age of 67 at a private hospital in Mumbai from all sectors including politicians, President, Prime Minister, former PM, Rahul Gandhi and many senior leaders pay their tributes.

రోమాంటిక్ హీరోకు రాజకీయ ప్రముఖుల నివాళులు

Posted: 04/30/2020 02:56 PM IST
Eternal romantic hero politicans mourns rishi kapoor s death

అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాలీవుడ్ ప్రముఖ నటులు హఠాన్మరణాలు చెందడంతో యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమ వారికి అశ్రునయనాలతో సంతాపాన్ని వ్యక్తం చస్తోంది. పేగు క్యాన్సర్ తో బాధ‌ప‌డుతూ ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన నుంచి తేరుకోక ముందే రిషికపూర్ మృతి చెందడం పట్ల రాజకీయ ప్రముఖులు  దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, శరద్ పవార్ తదితరులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

    ‘‘బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప వ్యక్తి రిషీ కపూర్‌. ప్రతిభావంతుడు. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలను ఆయన తరచూ గుర్తు చేస్తుండేవారు. అలాగే సోషల్‌మీడియా వేదికగా కూడా మేమిద్దరం సంభాషించుకునేవాళ్లం. సినిమాల పట్ల, భారతదేశ వృద్ధి పట్ల ఆయన ఎంతో ఆసక్తి కనబరిచేవారు. ఆయన ఆకస్మిక మరణం నన్ను ఎంతగానో బాధకు గురి చేసింది. ఆయన కుటుంబానికి, అభిమానులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను’’ - ప్రధాని నరేంద్ర మోదీ

    ‘‘సినీ పరిశ్రమకు చెందిన మరో గొప్ప వ్యక్తి మృతి చెందారు. ఆయన ఆకస్మిక మరణం నన్ను ఎంతో బాధపెట్టింది. మనసులో ఉన్న విషయాన్ని ధైర్యంగా బయటకు చెప్పగల ఓ గొప్ప నటుడ్ని కోల్పోయాం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’’ -  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

    ‘‘నా ఆప్తుడు, మంచి నటుడు రిషీకపూర్‌ మరణవార్త నన్ను కలచివేసింది. ఆయన కెరీర్‌ ఎంతో మందికి స్ఫూర్తి. మంచి స్నేహితుడ్ని కోల్పోవడం నాకెంతో బాధగా ఉంది. రిషీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను’’ - చిరంజీవి

    ‘‘లెజండరీ నటుడు రిషీ కపూర్‌ ఆకస్మిక మరణం ఎంతో బాధను కలిగించింది. ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు పెద్ద లోటు. ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలియచేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను’’ - పవన్‌కల్యాణ్‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles