Actor, Friends Put Off Fire On Maharashtra Hills రీల్ లైప్ విలన్.. రీయల్ లైఫ్ హీరో..

Actor friends douse fire along hill near katraj tunnel in mumbai

Wildlife Area, Extinguishing the Fire, Actor Sayaji Shinde, Sayaji Shinde, Real life Hero, Wild Fire, Mumbai, Maharashtra, Tollywood, Movies, Entertainment

Renowned actor Sayaji Shinde and three of his friends got down from their car near Katraj Tunnel after they saw a blaze along the hillside and doused it.

రీల్ లైప్ విలన్.. రీయల్ లైఫ్ హీరో..

Posted: 03/09/2020 04:43 PM IST
Actor friends douse fire along hill near katraj tunnel in mumbai

రీల్ లైఫ్ లో విలన్.. క్యారెక్టర్ అర్టిస్టుగా తనకంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న ఈయన రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. ఎంతో ధైర్యంతో, సహాసంతో ఆయన చేసిన పని.. ప్రస్తుతం నెట్టింట్లో ప్రశంసలను అందుకునేలా చేస్తోంది. ఇంతకీ ఆ హీరో, విలన్ ఎవరంటారా.. ఆయనే షియాజీ షిండే. ఆస్ట్రేలియాలో రేగిన వైల్డ్ ఫైర్ కార్చిచ్చు.. ఎంతోమందిని నిరాశ్రయుల్ని చేయగా, కొందరిన బలి తీసుకుంది. ఇక అనేక వన్యమృగాలను కూడా కబళించిన విషయం తెలిసిందే. సరిగ్గా అలానే ఓ అటవీ ప్రాంతంలో రేగిన మంటలను చూసి ఆయన స్పందించిన తీరు.. ప్రదర్శించిన సమయస్పూర్తికి నెట్ జనులు ముగ్ధులయ్యారు.

మహారాష్ట్రలోని పూణె శివార్లలో ఉన్న కాట్ రాజ్ ఘాట్ రోడ్డులో క్రితం రోజున తన కారులో వస్తున్న ఆయన మార్గమధ్యంలో అడవిలో చెలరేగిన మంటలను గమనించాడు. అడవి తగలబడుతొందా.? లేక ఎవరైనా మంట పెట్టారా అని అలోచించకుండా.. అస్ట్రేలియాలో రేగిన కార్చిర్చు గాయల నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. వెంటనే కారు ఆపి కిందికి దిగి తగలబడుతున్న ప్రదేశానికి వెళ్లారు. సమయానికి చెంత నీళ్లు లేకపోవడంతో అగ్గిని చల్లార్చేందుకు పచ్చి తుప్పలు  పట్టుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.

మంటలు ఎగసిపడుతున్నా వెనకడుగు వేయకుండా ఆపే ప్రయత్నం చేశారు. ఆయనకు ఆ తర్వాత కార్పొరేటర్ రాజేష్ బరాతే జత కలవడంతో ఇద్దరూ కలిసి కష్టపడి మంటలను అదుపు చేసి పెను ప్రమాదం జరగకుండా అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షిండేపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయనకున్న సామాజిక స్పృహకు హ్యాట్సాప్ చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sayaji Shinde  Real life Hero  Wild Fire  Mumbai  Maharashtra  Tollywood  

Other Articles