మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ తో రెండు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న తరువాత తాజాగా కిరణ్ కొర్రపాటి ఒక సినిమాలో నటిస్తున్నాడు. బాక్సార్ గా టైటిల్ ఫిక్స్ అయిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇందుకోసం కొంతకాలంగా వరుణ్ తేజ్ బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. ఈ రోజున ఈ సినిమా షూటింగును మొదలెట్టనున్నారు. వైజాగులో ఈ సినిమా షూటింగును ఆరంభించనున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ వైజాగ్ చేరుకున్నాడు.
షూటింగును మొదలెడుతూనే విడుదల తేదీని ఖరారు చేసేయడం విశేషం. జూలై 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అల్లు వెంకటేశ్ - సిద్ధూ ముద్ద కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. 35 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో, వరుణ్ తేజ్ జోడీగా 'సయీ మంజ్రేకర్' కనిపించనుంది. తెలుగులో ఈమెకి ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.
Back to sets!
— Varun Tej Konidela (@IAmVarunTej) February 24, 2020
Day 1 in vizag..
Need all your love!!#VT10 pic.twitter.com/3C35pZXqsE
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more