Jaanu Teaser Talk: Jaanu Is Heart-Touching నా వైపు ఓ చూపు అప్పియ్యలేవా ‘జాను’

Jaanu teaser out samantha and sharwanand s film is all about unspoken love

Jaanu, Jaanu teaser, Samantha, Sharwanand, 96 Telugu remake, Trisha, Vijay Sethupathi, Jaanu teaser release, Dil RaJu, Govind Vasantha, Chinmayi Sripaada, Kollywood, Tollywood, Movies, Entertainment

The Telugu version of the super hit Tamil film 96 is also directed by C Prem Kumar himself. He roped in Samantha and Sharwanand to step into the shoes of Trisha and Vijay Sethupathi respectively. Today the makers have released the film's teaser, which is heart touching.

ఆర్ యు ఏ వర్జిన్.? సామ్ ప్రశ్నకు కంగారుపడిన శర్వా..

Posted: 01/29/2020 07:07 PM IST
Jaanu teaser out samantha and sharwanand s film is all about unspoken love

వైవిద్యమైన చిత్రాలను ఎంచుకుంటూ విజయాల మార్గంలో దూసుకెళ్తున్న యంగ్ హీరో శర్వానంద్ తాజాగా తమిళ సూపర్ హిట్ చిత్రం ‘96’ రిమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సమంత కథానాయికగా తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తుండగా ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్ కుమార్ రీమేక్ కూడా తెరకెక్కిస్తున్నారు.

శర్వానంద్ చిత్రాలంటే మినిమమ్ గ్యారంటీగా కుటుంబ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులు కూడా వస్తారు. అయితే ఈ చిత్రంతో ఇటు యువతను కూడా తన చిత్రాలకు రప్పించుకునేలా ప్లాన్ చేస్తున్నాడు శర్వా. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్, పస్ట్ లుక్ నుంచి టీజర్ వరకు అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి థియేట్రికల్ ట్రైలర్ ను కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్.

‘‘ఎగసిపడే ఈ కెరటాలలో ఎదురుచూసే సముద్ర తీరాన్ని నేను.. పిల్ల గాలి కోసం ఎదురుచూసే నల్ల మబ్బులా.. ఓర చూపు కోసం.. నీ దోర నవ్వు కోసం.. రాత్రంతా చుక్కల్లెక్క పెడుతుంది నా హృదయం.. నా వైపు ఓ చూపు అప్పియ్యలేవా’’.. అంటూ వర్ణించే శర్వా వాయిస్‌తో స్టార్ట్ అయిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి కరంగా ఉంది. ‘‘పది నెలలు మోసి కన్న మీ అమ్మకి నువ్వు సొంతమైతే.. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే’’..  అన్న డైలాగ్స్ యువతలో ఈ చిత్రంపై అసక్తిని గోలుపుతున్నాయి.

ఇక సమంత కూడా ‘‘ఆర్ యు ఎ వర్జిన్’’ ‘‘నా రామ్ నన్ను వెతుక్కుంటూ వచ్చేశాడు.. కె.రామచంద్ర.. నాకోసం.. జాను కోసం’’.. వంటి డైలాగులు యువతతో పాటు ఫ్యామిటీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. దీంతో ఈ చిత్రంలో శర్వా, సమంతల నటన అద్భుతంగా ఉండబోతోందని అర్థమవుతుంది. మహేంద్రన్ జయరాజన్ విజువల్స్, గోవింద్ వసంత ఆర్ఆర్ బాగున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ు పూర్తి చేసి ఫిబ్ర‌వ‌రి 7న సినిమాను విడుద‌ల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jaanu  Samantha  Sharwanand  96 Telugu remake  Dil RaJu  Govind Vasantha  Tollywood  Movies  Entertainment  

Other Articles