Will Naresh Be Shown Door Out of MAA? ‘మా’ అధ్యక్షుడిపై చర్యలకు సభ్యుల లేఖ

Maa row jeevitha writes to disciplinary committee against naresh

Jeevitha Rajasekhar, Naresh, MAA Disciplinary Committee, Action, Executive Committee, Members, MAA President, MAA General Secretary, Tollywood

Jeevitha Rajasekhar, who is the General Secretary of the Movie Artists Association, has on Tuesday sat down with members of the Executive Committee. About 15 members of the EC have written a letter to the MAA Disciplinary Committee.

‘మా’ అధ్యక్షుడు నరేష్ పై చర్యలకు సభ్యుల లేఖ

Posted: 01/28/2020 09:55 PM IST
Maa row jeevitha writes to disciplinary committee against naresh

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) లో మళ్లీ అసంతృప్తి మంటలు ఎగసిపడుతున్నాయి. అధికారంలో ఎవరు వున్నా.. వారిపై విమర్శలు, అరోపణలు రావడం.. ఫలితంగా ప్రధాన కార్యదర్శి సహా ఈసీ సభ్యులు ఎదురు తిరగడం కామన్ గా కనిపిస్తోంది. నవ్వుల కిరీటీ రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం నుంచే ‘మా’లోని లుకలుకలు బయటకు వచ్చాయి. అంతకుముందు కూడా సభ్యుల మధ్య మనస్పర్థలు వున్నా అవి బయటకు పెద్దగా పొక్కలేదు. అయితే ‘మా’ అధ్యక్షుడిగా గెలిచినా.. తన షూటింగ్ బిజీలోనే అలసిపోయిన రాజేంద్రుడు ఈ అరోపణల నుంచి తప్పించుకున్నారు.

రాజేంద్రప్రసాద్ ను తప్పించి అధ్యక్ష పీఠంపై ఎక్కిన ఉపాధ్యక్షుడు శివాజీరాజాపై అప్పటి ప్రధాన కార్యదర్శి నరేష్ విమర్శలు చేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన ‘మా’ అలజడి ఇంకా రగులుతూనే వున్నాయి. ఎంతలా అంటే నరేష్ సొంత ఫ్యానల్ నుంచి గెలిచిన జీవిత రాజశేఖర్ల నుంచే విమర్శలను ఎదుర్కోనేవరకు వెళ్లింది. అంతేకాదు.. ఆయనపై క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకోవాలని కూడా మా సభ్యులు.. ఎగ్జిక్యూటివ్ సభ్యులు అందరూ డిమాండ్ చేస్తున్నారు. అందుకు కారణం నరేష్ గతంలో శివాజీరాజాపై చేసిన అరోపణలే.. ఇప్పడు ఈయనపై కూడా వినిపించడమే.

‘మా’ అధ్యక్షుడు నరేష్ కూడా నియంతలా వ్యవహరిస్తున్నారని, నిబంధనలను పాటించకుండా ఏకపక్షంగా నిధులను ఖర్చుచేస్తున్నారని, అరోపిస్తున్నారు ‘మా’ సభ్యులు. మొన్నటి మొన్న మా డైరీ ఆవిష్కరణలో మెగాస్టార్ చిరంజీవి ఎదుట డాక్టర్ రాజశేఖర్ తీరుతో వార్తల్లో నిలిచింది ‘మా’. ఇక ఎప్పటి నుంచో ‘మా’ అధ్యక్షుడు నరేష్‌ తీరుపై కొందరు ఈసీ మెంబర్లు బహిరంగంగానే ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఇదంతా మామూలే అనుకున్నా.. ఇప్పుడు ‘మా’ అసోసియేషన్లో ఆధిపత్య పోరు మరింత ముదిరింది. ఇవాళ సమావేశమైన ‘మా’ అసోసియేషన్ ఈసీ మెంబర్లు.. ‘మా’ అధ్యక్షుడు నరేష్ పై చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు.

ముఖ్యంగా మా అధ్యక్షుడు నరేష్‌ ప్రవర్తన, ఏకపక్ష నిర్ణయాలను నిరసిస్తూ, ‘మా’లో ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు ఎదుర్కొంటున్న అవమానాలను ప్రస్తావిస్తూ, క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. నరేష్‌పై తగిన చర్యలు తీసుకుంటూ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామంటూ తొమ్మిది పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి రాశారు ‘మా’ ఈసీ మెంబర్లు. జీవిత రాజశేఖర్‌, హేమ, జయలక్ష్మి, మహ్మద్‌ అలీ, రాజా రవీంద్ర, ఉత్తేజ్‌, ఎంవీ బెనర్జీ, సురేష్‌, ఏడిద శ్రీరామ్‌, తనీష్‌, జి.అనిత చౌదరిలు సంతకం చేసిన ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇక, ఈసీ మెంబర్లతో జీవిత సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles