Salman Khan snatches fans' phone సల్లూ భాయ్.. బాలీవుడ్ బాలయ్యా.? వీడియో వైరల్..

Salman khan loses cool snatches fan s phone at goa airport

bollywood, Bollywood fans, dabangg 3, Disha patani, Goa airport, Radhe, randeep hooda, salman khan fans, Salman Khan Goa Airport, Salman Khan Goa Airport fan mobile phone, Salman Khan Goa Airport incident, Salman Khan Goa Airport video, Salman Khan videos

Irked by the behaviour of a fan who tried to click a selfie with him at the Goa airport, Bollywood actor Salman Khan on Tuesday snatched his mobile phone. He reportedly arrived in the city for shooting of Radhe: Your Most Wanted Bhai.

సల్లూ భాయ్.. బాలీవుడ్ బాలయ్యా.? వీడియో వైరల్..

Posted: 01/28/2020 09:04 PM IST
Salman khan loses cool snatches fan s phone at goa airport

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ మరోసారి ఫ్యాన్స్‌పై అసహనం ప్రకటించి వార్తల్లో నిలిచారు. తనతో సెల్ఫీ క్లిక్ చేయడానికి ప్రయత్నించిన అభిమాని పట్ల సల్మాన్‌ ప్రవర్తన ఆయన  పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. గోవా ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటికి నడిచి వస్తున్న  హీరో  సల్మాన్‌తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు ఒక వ్యక్తి.  దీనిపై  కోపం తెచ్చుకున్న  సల్మాన్‌  ఈ వ్యక్తి నుండి మొబైల్‌ చటుక్కున లాక్కున్నా డు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దీంతో దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రేక్షకులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు సల్మాన్ చర్యపై సానుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. బాలీవుడ్ బాలయ్య అంటూ కామెంట్ చేస్తున్నారు. ఫ్యాన్ ఫోటో క్లిక్ మనిపించేనంతలో అతని ఫోన్ ను చేతిలోకి తీసేసుకున్నాడు సల్లూభాయ్. గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది.   

తరువాత అతను విమానయాన సంస్థలో పనిచేస్తున్న గ్రౌండ్ స్టాఫ్‌గా గుర్తించారు. వీడియో వైరల్‌ అయిన తరువాత ఈ సంఘటన గురించి విచారించి ఈ విషయాన్ని ధృవీకరించామని విమానాశ్రయ సీనియర్ అధికారి  చెప్పారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదన్నారు.  కాగా సల్మాన్ ప్రస్తుతం రాధే చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ ఏప్రిల్‌ నాటికి (ఈద్‌) సల్మాన్ రాధే మూవీ , అక్షయ్ కుమార్  చిత్రం లక్ష్మీ బాంబ్ చిత్రంతో  పోటీ పడనుంది.  దీంతో పాటు సాజిద్ నాడియా వాలాతో కభీ ఈద్ కభీ దీపావళి అనే సినిమాకు సైన్‌ చేసిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles