Kajal Aggarwal to Join Madame Tussauds సింగపూర్ మ్యూజియంలో చేరనున్న ‘చందమామ’

South indian actress kajal aggarwal to join madame tussauds

Madame Tussauds, Madame Tussauds Singapore, Kajal Aggarwal, Kajal Aggarwal wax idol, Kajal Aggarwal Madame Tussauds, Kajal Aggarwal latest, Kajal Aggarwal updates, Kajal Aggarwal new, Kajal Aggarwal is the First South Indian Actress to Join Madame Tussauds, tollywood, movies, entertainment

Kajal Aggarwal is all set to join the elite group of celebrities in the prestigious Madame Tussauds museum, Singapore. The actress is all thrilled and excited about the honor. She took her official Instagram page to share the great news along with her joy.

సింగపూర్ మ్యూజియంలో చేరనున్న ‘చందమామ’

Posted: 12/17/2019 09:01 PM IST
South indian actress kajal aggarwal to join madame tussauds

అందాల చందమామ కాజల్‌ అగర్వాల్ తెరంగ్రేటం చేసి దశాబ్దకాలం అయినా ఇప్పటికీ యువ నటీమణులకు తానేమాత్రం తక్కువకాదని చక్కని పోటీనిస్తోంది. ఈ క్రమంలో ఈ అమ్మడు అరుదైన గౌరవాన్ని దక్కించుకోబోతొంది. ప్రముఖ మ్యూజియం మేడమ్‌ టుసాడ్స్‌లో ఆమె మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని కాజల్‌ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు.

ఆ అరుదైన గౌరవం కాజల్ కు దక్కటం ద్వారా మేడమ్ టుసాడ్స్ లో అడుగుపెట్టిన తొలి దక్షిణ భారత హీరోయిన్ గా కూడా అమె గుర్తింపును పొందనున్నారు. కాగా ఈ మేరకు సామాజిక మాదమ్యంలో ఈ గౌరవం తనకు దక్కబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఫొటోలను షేర్‌ చేశారు. మ్యూజియం సిబ్బంది కాజల్‌ జుట్టు, శరీరం, కళ్ల రంగుతోపాటు ముఖం కొలతలు కూడా తీసుకున్నారు.

‘సింగపూర్‌లోని మేడమ్‌ టుసాడ్స్‌ మ్యూజియంలో నా మైనపు విగ్రహం ఏర్పాటు చేయబోతుండటం చాలా సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న నా విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం. చిన్నతనంలో మేడం టుసాడ్స్‌ మ్యూజియంకు వెళ్లి, అక్కడి విగ్రహాల్ని మైమరిచిపోయి చూడటం నాకు ఇంకా గుర్తుంది. ఇప్పుడు వాటి పక్కన నా విగ్రహం కూడా ఏర్పాటు చేయబోతుండటం గౌరవంగా ఉంది. కొత్త దశాబ్దం మంచి పనులతో ప్రారంభం కాబోతోంది. కష్టానికి, వ్యక్తిగత త్యాగానికి తగ్గ మరింత గుర్తింపు లభించబోతోంది. ఇన్నేళ్లు నాకు మద్దతుగా ఉన్న వారికి ఎప్పటికీ కృతజ్ఞురాలిగా ఉంటాను’ అని కాజల్‌ పోస్ట్‌లు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madame Tussauds  Singapore  Kajal Aggarwal  wax idol  First South Indian Actress  tollywood  

Other Articles