Rajinikanth is a 'bad cop' in the 'Darbar' trailer మాస్ ఎలిమెంట్స్ తో అదరగోడుతున్న రజనీ ‘దర్భార్’

Rajni steals hearts as mumbai supercop in darbar trailer

Darbar, darbar trailer, darbar trailer out, Darbar release, Rajinikanth, Superstar rajinikanth, AR Murugadoss, Nayanthara, Suniel Shetty, rajinikanth cop, Rajinikanth police, darbar pongal, tollywood, movies, entertainment

Superstar Rajinikanth is thrilled about the release of his upcoming film, Darbar, which is helmed by AR Murugadoss. The commercial entertainer, produced by Lyca Productions, features Nayanthara, Suneil Shetty, Prateik Babbar, Yogi Babu and Nivetha Thomas in important roles.

మాస్ ఎలిమెంట్స్ తో అదరగోడుతున్న రజనీ ‘దర్భార్’

Posted: 12/16/2019 09:55 PM IST
Rajni steals hearts as mumbai supercop in darbar trailer

సూపర్‌స్టార్‌ రజనీకాంత్, నయనతార జంటగా నటిస్తున్న 'దర్బార్' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నుండి.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఫీషియల్ ట్రైలర్ ను చిత్రం యూనిట్ ఇవాళ విడుదల చేసింది. రజనీ అభిమానులు కోరుకునే ఆయన మాస్ ఎలిమెంట్స్ 'దర్బార్' చిత్రంలో పుష్కలంగా ఉన్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. దీనికి తోడు రజనీకాంత్ మార్కు వినోదం కూడా బోనస్ గా అందించనున్నారు మురగదాస్.

"అయాం ఏ బ్యాడ్ కాప్" (నేను మహా చెడ్డ పోలీసును) అంటూ రజనీ చెప్పే డైలాగు అభిమానులను తప్పకుండా అలరిస్తుంది. "పోలీసుల వద్దకు లెఫ్ట్ లో రావొచ్చు, రైట్ లో రావొచ్చు కానీ స్ట్రెయిట్ గా రాకూడదు" అనే డైలాగ్ మరింత రక్తికట్టించేలా ఉంది. వాడు పోలీసాఫీసరా సర్..హంతకుడు​’, ‘ఆదిత్యా అరుణాచలం కమిషనర్ ఆఫ్ ముంబై’ అనే డైలాగులతో షురూ అయ్యే ట్రైలర్ రజనీ అభిమానులను అలరించేలా ఉంది.

‘ఆ చూపేంటి..ఒరిజిల్‌ గానే విలనమ్మా..ఇదేలా ఉంది’, ‘ ఐయామ్‌ ఏ బ్యాడ్‌ కాప్‌’ (నేను మహా చెడ్డ పోలీసును) అంటూ రజనీకాంత్‌ చెప్పే సంభాషణలు హైలెట్ గా నిలిచాయి. లైకా ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'దర్బార్' లో రజనీకాంత్ 'ఆదిత్య అరుణాచలం' అనే పోలీసాఫీసర్ పాత్ర పోషించారు. ముంబయి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ప్రతినాయక పాత్ర పోషించాడు. ఈ చిత్రంలో నివేదా థామస్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Darbar  trailer  Rajinikanth  AR Murugadoss  Nayanthara  Suniel Shetty  darbar pongal  tollywood  

Other Articles