Allu Arjun’s Ala Vaikunthapurramuloo: Action Drama అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ టీజర్ గ్లింప్స్..

Ala vaikunthapurramuloo teaser glimpse allu arjun s action drama

#AlaVaikunthapurramuloo, Teaser Glimpse, Allu Arjun, Pooja Hegde, Suneel, Trivikram, Thaman S, Tollywood, movies, entertainment

Novel Giant name Allu Arjun Fans can breathe a mutter of reduction, as sooner or later, the makers dangle unveiled the liberate date of the very first teaser from Ala Vaiukunthapurramloo.

అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ టీజర్ గ్లింప్స్..

Posted: 12/09/2019 08:59 PM IST
Ala vaikunthapurramuloo teaser glimpse allu arjun s action drama

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’ పూజా హెగ్డే కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర టీజర్ గ్లింప్స్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. అయితే వాస్తవానికి నిన్న టీజర్ ను వదలాల్సి వున్నప్పటికీ, మెగా అభిమాని నూర్‌ అహ్మద్‌ ఆకస్మిక మృతి నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్‌ విడుదలను వాయిదా వేసింది.

డిసెంబరు 11న సాయంత్రం 4.05గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు సినిమా టీజర్‌ గ్లింప్స్‌ను అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం. వెనక్కి తిరిగి నిలబడి ఉన్న అల్లు అర్జున్‌ కోటు వేసుకుని టేబుల్‌పై నడుచుకుంటూ వస్తున్న వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.

‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత బన్ని-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. తమన్‌ స్వరాలు అందించిన ‘సామజవరగమన’, ‘రాములో రాముల’పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. టబు, నివేదా పేతురాజు, సుశాంత్‌, రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిషోర్‌, సునీల్‌, నవదీప్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక, హాసిని క్రియేషన్స్‌, గీతాఆర్ట్స్‌ పతాకంపై, ఎస్‌.రాధాకృష్ణ, అల్లు అరవింద్‌లు నిర్మిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : #AlaVaikunthapurramuloo  Teaser Glimpse  Allu Arjun  Pooja Hegde  Suneel  Trivikram  Thaman S  Tollywood  

Other Articles