actress Anjali Ameer face death threat నన్ను చంపాలని చూస్తున్నాడు: నటి అంజలి

Transgender actress anjali ameer face death threat

Peranbu, Kozhikode, Koduvally, Anjali Ameer, actress, acid throwing, live-in relationship, partner, Mollywood, Tollywood, Movies, Entertainment

Transgender actor Anjali Ameer of ‘Peranbu’ fame has alleged that she is facing threat to her life and also threat of acid attack from her partner with whom she has been in a live-in relationship.

నన్ను చంపాలని చూస్తున్నాడు: నటి అంజలి

Posted: 12/05/2019 06:31 PM IST
Transgender actress anjali ameer face death threat

అంజలి అమీర్‌.. మనదేశంలో మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ నటి. ఎన్నో బుల్లితెర కార్యక్రమాలతో ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఈ మలయాళి నటి గతేడాది విడుదలైన తమిళ చిత్రం ‘పెరంబు’లో నటించారు. ఈ చిత్రంతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె తన ప్రియుడి నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆమెను వేధింపులకు గురించేస్తున్నాడని వివరించారు. అంజలి అమీర్‌ గతకొంతకాలంగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నారు.

అయితే ఆ వ్యక్తి ఆమెను వేధింపులకు గురి చేస్తున్నారని అంజలి ఇటీవల ఫేస్‌బుక్‌ లైవ్‌ వేదికగా అభిమానులకు తెలిపారు. ‘ఆ వ్యక్తి నన్ను మోసం చేసి సహజీవనం చేసేలా చేశాడు. అతను మంచివాడు కాదని తెలిసింది. వెంటనే అతన్ని వదిలేయాలనుకున్నాను. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అతను నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. నా మీద యాసిడ్‌ దాడి చేస్తానని అంటున్నాడు. నేను కొంతకాలంగా నా బ్యాంకు ఖాతాలో రూ.4లక్షలను పొదుపు చేసుకున్నాను. రెండు సంవత్సరాల నుంచి అతను ఆ డబ్బును కూడా వాడేసుకున్నాడు.’ అని అంజలి తెలిపారు.

అతని వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, తనకు బతుకు మీదే ఆశ కరువైందని అమె బాధను వ్యక్తం చేశారు. తన జీవితాన్నే ఆధారంగా చేసుకుని ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు అంజలి ఇటీవల ప్రకటించారు. ఆమె ఏవిధంగా నటిగా మారింది. ఆమె ఎదుర్కొన్న ఎన్నో సమస్యలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈసినిమా ప్రారంభం కావాల్సి ఉంది. ఇంతలో అమె తన సహజీవనం చేసిన వ్యక్తి చేతిలో చిత్రవధను అనుభవిస్తోందని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Super star rajinikanth s darbar joins 200 crore club

    రూ.200 కోట్ల క్లబ్ లోకి రజనీ ‘దర్భార్’.!

    Jan 22 | సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఖాతాలో మరో రూ.200 కోట్ల సినిమా చేరింది. ఆయన పోలీసు అధికారిగా నటించిన సినిమా ‘దర్బార్‌’. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకుడు. నయనతార, నివేదా థామస్‌, సునీల్‌ శెట్టి, యోగిబాబు తదితరులు దీనిలో... Read more

  • Allu arjun s ala vaikunthapurramuloo 10 days share 143 not out

    అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ రికార్డ్ ‘అలా వైకుంఠపురంలో’.!

    Jan 22 | అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో..’ బాక్సాఫీసు వద్ద తెగ సవ్వడి చేస్తోంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే ఏకంగా 220 కోట్ల క్లబ్ లో చేరి... Read more

  • Actress amala paul father passes away

    హీరోయిన్ అమలాపాల్ కు పితృ వియోగం

    Jan 22 | హీరోయిన్‌ అమలాపాల్‌ ఇంట పెను విషాదం అలుముకుంది. అమె తండ్రి పౌల్‌ వర్గీస్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోచ్చిలోని ఓ ప్రైవేటు అసుపత్రిలో చికిత్స పోందుతూ మరణించారు. ఆయనను సజీవంగా... Read more

  • Rrr ajay devgn begins shooting for ss rajamouli s film

    ఆర్ఆర్ఆర్ అప్ డేట్: షూటింగ్ కోసం వచ్చిన బాలీవుడ్ స్టార్

    Jan 21 | దర్శకధీరుడు తెలుగు ప్రేక్షకులు ముద్దుగా పిలిచే జక్కన రూపొందిస్తున్న మరో భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన ఓ తాజా అప్ డేట్ ఇచ్చారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్.. యంగ్... Read more

  • Jaanu s first single pranam samantha akkineni and sharwanand s song is a soulful melody

    శర్వానంద్, సమంత ‘జాను’ నుంచి ఆకట్టుకునే పాట.!

    Jan 21 | శర్వానంద్‌, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘జాను’ నుంచి ఇటీవలే శర్వానంద్ ఫస్ట్ లుక్.. ఆ వెంటనే చిత్రానికి సంబంధించిన టీజర్ రాగా, తాజాగా, ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్... Read more

Today on Telugu Wishesh