Tollywood welcomes encounter of Disha Accused ఎన్ కౌంటర్ ను స్వాగతించిన టాలీవుడ్ ప్రముఖులు

Tollywood applause encounter of disha accused

Disha, Encounter, NTR, Harish Shankar, chiranjeevi, Nagarjuna, Samantha, Rakul preet singh, Manchu Lakshmi, Manchu Manoj, Nani, Allu Arjun, Bala Krishna, vishal, kona venkat, Tollywood, movies, Entertainment

Tollywood had welcomed the police action of encounter to all the accused in Disha Veternaty doctor Rape and Murder case. celebs took their twitter and posted tweets in support of cyberabad police.

ఎన్ కౌంటర్ ను స్వాగతించిన టాలీవుడ్ ప్రముఖులు

Posted: 12/06/2019 08:38 PM IST
Tollywood applause encounter of disha accused

డాక్టర్ దిశ హత్యాచార ఉదంతంపై స్పందించిన తెలుగు సినీ పరిశమ.. అంతకు రెట్టింపు వేగంతో నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించింది. ఈ సమాజాంలో ఆడపిల్లగా పుట్టడం కూడా నేరమా..? పోలీసులు సకాలంలో స్పందించి చర్యలు తీసుకుని వుంటే అని ప్రశ్నించిన నటీమణులు తాజాగా.. పోలీసుల చర్యలు బేష్.. తగినశాస్తి జరిగిందని ప్రశంసిస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. అనేక మంది అగ్రతారాల నుంచి అందరూ ఈ ఘటనపై స్పందించి.. తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జూ. ఎన్టీఆర్

దిశపై హత్యాచారం జరిపిన నిందితుల ఎన్ కౌంటర్ పై హీరో ఎన్టీఆర్ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టిన ఆయన, "న్యాయం జరిగింది. ఇక దిశ ఆత్మ శాంతిస్తుంది" అని వ్యాఖ్యానించారు. దిశ ఘటనలో నిందితులకు శిక్షగా ఎన్ కౌంటర్లో పోలీసులు హతమార్చిన వెనువెంటనే ఆయన స్పందించారు. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ చూసిన వెంటనే స్పందించిన తొలి హీరో ఎన్టీఆర్.

దర్శకుడు హరీశ్ శంకర్

దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ హర్షం వ్యక్తం చేశారు. కమిషనర్ సజ్జనార్ పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్‌కౌంటర్ విషయాన్ని చాటింపు వేసి మరీ ఘనంగా ప్రచారం చేయాలని కోరారు. నిందితుల ఎన్‌కౌంటర్ గురించి అందరికీ తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

నటుడు మంచు మనోజ్

నిందితులను ఎన్‌కౌంటర్ చేసేందుకు పోలీసులు ఉపయోగించిన ఆ బుల్లెట్లను దాచుకోవాలని ఉందని, ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉందని అన్నాడు. ఎన్‌కౌంటర్ చేసిన ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉందని అన్నాడు. నలుగురు చచ్చారనే వార్తలో ఇంత కిక్కు ఉందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘ఈ రోజే నీ ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా’’ అని మనోజ్ ట్వీట్ చేశాడు.

నాగార్జున అక్కినేని

"ఈ ఉదయం నిద్ర లేవగానే ఓ వార్తను విన్నాను. న్యాయం జరిగింది" అని టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున వ్యాఖ్యానించారు. నేడు జరిగిన దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను నాగార్జున ఉంచారు.

నాని

దిశ హత్యాచార ఘటనపై న్యాచురల్ స్టార్ నాని తనదైన శైలిలో స్పందించారు. "ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి. వాడు పోలీసోడు అయి ఉండాలి" అని వ్యాఖ్యానించాడు.

రకుల్ ప్రీత్ సింగ్

ఇక ఎన్ కౌంటర్ ఘటనపై స్పందించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పోలీసులకు థ్యాంక్స్ చెప్పారు. "అత్యాచారం చేసిన తరువాత ఎంత దూరం పారిపోతారు. థ్యాంక్యూ తెలంగాణ పోలీస్" అని రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించింది.

లక్ష్మీ మంచు

దిశ హత్యాచార ఘటనపై స్పందించిన లక్ష్మీ మంచు "ఒకప్పుడు నేను మరణదండనకు వ్యతిరేకం. కానీ కొంతకాలం క్రితం నా అభిప్రాయాన్ని మార్చుకున్నా. అత్యాచారాలకు పాల్పడితే ఉరి తీయాలి" అని మంచు లక్ష్మి వ్యాఖ్యానించారు.

సమంత అక్కినేని

దిశ హత్యాచార కేసు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్‌ చేయడంపై సినీ నటి సమంత అక్కినేని హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులకు సెల్యూట్ అని హీరోయిన్ ఆమె ట్వీట్ చేశారు. 'భయానికి సరైన సమాధానం దొరికింది. అప్పుడప్పుడు ఇదే పరిష్కారం' అని ఆమె అన్నారు. 'ఇప్పుడు దిశ ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఇటువంటి ఘోర ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. చిన్నప్పటి నుంచి మంచి బుద్ధులు నేర్పించాలి. జైహింద్' అని రవితేజ పేర్కొన్నారు.     నిందితులను చంపేయడమే ఇటువంటి సమస్యలకు పరిష్కారమంటూ సినీనటులు ట్వీట్లు చేస్తున్నారు.

అల్లు అర్జున్

'న్యాయం జరిగింది' అంటూ సినీనటుడు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

హీరో విశాల్

'చివరికి న్యాయం జరిగింది... తెలంగాణ పోలీసులకు నా కృతజ్ఞతలు.. ఆర్ఐపీ దిశ' అని సినీనటుడు విశాల్ ట్వీట్ చేశారు.

కోన వెంకట్

దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో న్యాయం జరిగిందని కథా రచయిత కోన వెంకట్ పేర్కొన్నారు.

నిఖిల్ సిద్ధార్థ్

ఎన్‌కౌంటర్‌ పై నిఖిల్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. దిశ నిందితులకు సరైన శాస్తి జరిగిందని హీరో నిఖిల్ పేర్కొన్నారు. నేటి తెల్లవారుజామున దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సినీ ప్రముఖులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ''అవమానవీయ, భయంకరమైన నేరానికి పాల్పడిన నిందితులకు చివరికి సరైన శాస్తి జరిగింది. అమాయకమైన దిశను మనం ఎప్పటికీ తిరిగి పొందలేము. కానీ ఇంకెప్పుడైనా ఎవరైనా రేప్ గురించి కానీ.. మర్డర్ గురించి కానీ ఆలోచిస్తే.. వాళ్లు తదుపరి చర్యల గురించి కూడా గుర్తు చేసుకుంటారు'' అని ట్వీట్ చేశాడు.

పూరీ జ‌గ‌న్నాథ్

“సెల్యూట్‌.. తెలంగాణ పోలీస్ డిపార్టుమెంటుకి చేతులెత్తి మొక్కుతున్నాను. మీరే మా రియ‌ల్ హీరోస్… నేనెప్పుడు ఒక విష‌యాన్ని నమ్ముతాను. మనకి కష్టమొచ్చిన కన్నీళ్లొచ్చినా పోలీసోడే వస్తాడు. నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే” అంటూ పూరీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. “ప్రియాంక‌రెడ్డికు న్యాయం చేయడం ఇక్కడ ఆగొద్దు . బాల్యం నుండి విద్య, సాధికారత మరియు జ్ఞానోదయం ద్వారా ఇటువంటి ఘోరమైన నేరాలను నిరోదించాలి. జైహింద్. ఇప్పుడు ప్రియాంక‌రెడ్డి ఆత్మ శాంతిస్తుంది” అని ర‌వితేజ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఛార్మి

ఇటువంటి ఘటన మరొకసారి జరగకుండా హైదరాబాద్ పోలీసులు సరైన రీతిలో బుద్ధి చెప్పారని. ఇలాంటి వ్యక్తులు రేప్ చేసే ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తుకు రారేమో. కానీ ఎప్పటి నుండి పోలీసులు గుర్తుకు వస్తారు అని నిజమైన దీపావళి అసలైన దీపావళి అంటే ఇదే అని వీడియో రూపంలో పోలీసులపై ప్రశంసల వర్షం ఛార్మి కురిపించింది.

నందమూరి బాలకృష్ణ

దిశ ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ పై దుండగుల సామూహిక అత్యాచారం, హత్య ఘటనకు ప్రతిఫలంగా తగిన శిక్ష ఎదుర్కొన్నారని అన్నారు. మహిళలపై దేశ వ్యాప్తంగా ఘోర ఘటనలు జరుగుతున్నాయని బాలకృష్ణ అన్నారు. భగవంతుడే పోలీసుల రూపంలో ఈ రోజు వారికి సరైన శిక్ష విధించాడని అన్నారు. మరోసారి ఇటువంటి చర్యలకు ఎవరూ పాల్పడకుండా భగవంతుడే కదిలి వచ్చినట్లుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసు శాఖకు అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు.

చిరంజీవి

దిశ హత్యాచర కేసులోని నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టారని తెలిసిన క్రమంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘‘దిశ సంఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో ఇది సత్వర న్యాయం, సహజ న్యాయం అని నేను భావించాను. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందే. అత్యంత దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైన ‘దిశ’ ఆత్మకు శాంతి చేకూరినట్లయింది. కడుపు కోతతో బాధపడుతున్న ‘దిశ’ తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించినట్లయింది.

ఆడపిల్లల్ని ఆటవస్తువుగా పరిగణించి వారిపై దారుణమైన ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలి! ఇటువంటి అత్యాచార సంఘటనలు పునరావృత్తం కాకుండా నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలి. వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యవహారం కొలిక్కి రావడం అభినందనీయం. సజ్జనార్ గారి లాంటి పోలీస్ ఆఫీసర్లు ఉన్న పోలీస్ వ్యవస్థకి, కేసీఆర్ గారి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Harish Shankar  Nagarjuna  Samantha  Chiranjeevi  Allu Arjun  Bala Krishna  Tollywood  

Other Articles

 • Tollywood director boyapati srinu mother sitaravamma passes away

  దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాతృ వియోగం

  Jan 17 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి బోయపాటి సీతారావమ్మ ఇవాళ కన్నుమూశారు. ఆమె వయసు ప్రస్తుతం 80 సంవత్సరాలు. గతకొంత కాలంగా ఆమె తీవ్ర అస్వస్థతతో... Read more

 • Famous telugu producer allu arvind to receive champion of change award

  అల్లువారింట క్రాంతి నింపిన సంక్రాంతి.. అరవింద్ కు అవార్డు..

  Jan 17 | అల వైకుంఠపురంలో ప్రివ్యూ ఈవెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో ఆ వేడుకకు వచ్చిన ప్రేక్షకుల సాక్షిగా.. టీవీలలో చూస్తున్న వీక్షకుల సాక్షిగా తన కుమారుడు, సినీ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు... Read more

 • Prabhas resumes shooting for jaan with pooja hegde

  ప్రభాస్ అభిమానులకు సంబరం.. ‘జాన్’ నుంచి స్టిల్

  Jan 17 | బాహుబలి చిత్రాల హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తరువాత వచ్చిన సాహో చిత్రంతో ఫర్వాలేదు అనిపించాడు. అయితే తాజాగా ఆయన అటు చారిత్రాత్మక చిత్రాలకు, ఇటు యాక్షన్ చిత్రాల జోలికి వెళ్లకుండా మిస్టర్... Read more

 • Man tries to kiss sara ali khan s hand actress left shocked

  యువరాణికి ముద్దపెట్టే యత్నం.. షాకైన నటి

  Jan 10 | అభిమానం హద్దులోనే వుంటే మంచిదని.. హద్దుమీరితే సెలబ్రిటీలు ఇబ్బందులు పడాల్సివుంటుందని మరోమారు ఓ ఫ్యాన్ చేసిన అత్యుత్సాహం నిరూపించింది. బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌ కు అనుభవం ఎదురుకావడంతో అమె షాక్ అయ్యారు. ‘కేదరనాథ్‌’... Read more

 • Kannada actress vijayalakshmi marries director anjanayya

  మిస్ అయిన హీరోయిన్.. మిస్సెస్ గా ప్రత్యక్షం..

  Jan 10 | కర్ణాటకలో తీవ్ర సంచలనం రేపిన హీరోయిన్ విజయలక్ష్మి అదృశ్యం కేసు సుఖాంతమైంది. ఓ సినీ నిర్మాత నుంచి ఆమె డబ్బు తీసుకుని పారిపోయినట్టు వార్తలు రాగా, తాజాగా ఆమె రాయచూరులో తన భర్త ఆంజనేయతో... Read more

Today on Telugu Wishesh