Nayantara Vasanthakalam Trailer వసంతకాలంలో బధిరరాలుగా నయనతార భయపెడుతోంది..

Vasanthakalam telugu trailer nayantara performance as dumb and deaf

Vasanthakalam Movie, Vasanthakalam Official Trailer, Nayanthara, Bhumika, Chakri Toleti, Tollywood, movies, entertainment

South Indian most popular actress Nayantara performance as deaf and dumb in the movie Vasanthakalam is getting round the aplause from audience after the trailer is released today.

వసంతకాలంలో బధిరరాలుగా నయనతార భయపెడుతోంది..

Posted: 11/23/2019 08:51 PM IST
Vasanthakalam telugu trailer nayantara performance as dumb and deaf

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తమిళ సినిమా ‘కోలైయుతీర్ కాలమ్’.. ‘బిల్లా 2’ ఫేమ్ చక్రి తోలేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో భూమిక కీలక పాత్రలో నటిస్తోంది. సస్సెన్స్ హారర్ థ్రిల్లర్ అంశాలతో తెరెక్కిన ఈ సినిమాను తెలుగులో వసంత కాలం పేరుతో విడుద‌ల చేస్తున్నారు సినిమా యూనిట్. ఇందుకు సంబంధించి తమిళంలో విడుదల చేసిన ట్రైలర్ ను తెలుగు ఆడియన్స్ కోసం తెలుగులో విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రంలో నయనతార బధిర మహిళగా నటిస్తోందని సమాచారం. ఈ చిత్రంలో భూమిక, ప్రతాప్‌ పోతన్, రోహిణి హట్టంగడ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. తెలుగులో ఈ చిత్రాన్ని 5 క‌ల‌ర్స్ మీడియా ప‌తాకంపై నిర్మాత దామెర వి.ఎస్‌.ఎన్‌. శ్రీనివాస్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘వసంత కాలం’ డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్లో మూవీ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం. తెలుగులోనూ ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vasanthakalam Movie  Official Trailer  Nayanthara  Bhumika  Chakri Toleti  Tollywood  

Other Articles