జార్జిరెడ్డిచిత్ర బృందం ఒక ప్రత్యేక పాట - పవన్ కళ్యాణ్ గారికి అంకితం George reddy movie team dedicates a special song to Powerstar Pawan Kalyan

George reddy movie team dedicates a special song to powerstar pawan kalyan

Vijayam Song, Power Star Pawan Kalyan, Janasena Party, George Reddy Movie, Tollywood News, George Reddy Songs

George Reddy Movie team has released the 'Vijayam Song Special Cut' and the team has dedicated this song to Power Star Pawan Kalyan.

జార్జిరెడ్డిచిత్ర బృందం ఒక ప్రత్యేక పాట - పవన్ కళ్యాణ్ గారికి అంకితం

Posted: 11/15/2019 12:21 PM IST
George reddy movie team dedicates a special song to powerstar pawan kalyan

జార్జిరెడ్డి చిత్రం నేడు మన తెలుగు చిత్ర సీమలో తెగ సందడి చేస్తుంది..ఆ చిత్ర కథ పలువురి నాయకుల, విద్యార్థుల మనసులను 0 తాకి ఒక స్వచ్ఛమైన అనుభూతిని కలిగిస్తుంది. 1970 సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక యదార్ధ గాధ నేపథ్యం ఆధారంగా ఈ చిత్రం మన ముందుకు రానున్నది. ఈ చిత్రంలో జార్జిరెడ్డి ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగిన తీరును, అయన జీవిత శైలిని మనకి అందించబోతున్నారు. జార్జిరెడ్డి గారి పాత్రలో వంగవీటి ఫేమ్ సందీప్ కుమార్ నటించనున్నారు.. అతని నటన మనల్ని తన మొదటి చిత్రంతోనే ఆకట్టుకున్నది. ఎందుకంటే తన మొదటి చిత్రంలోనే మనల్ని తన నటన లావణ్యంతో కట్టిపడేసారు. జీవన్ రెడ్డి దర్శక బాధ్యతను తీసుకున్నారు. అప్పి రెడ్డి గారు నిర్మాతగా, సంగీతం బొబ్బిలి సురేష్ గారు రానున్నారు. అంతేకాకుండా సత్య దేవ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.

జన సేన అధినేత పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘం చిన్నది కాలేదు. అయన ఒక సినిమా కోసం అభిమానులు ఎంతగా వేచి ఉంటారో వర్ణించలేము. పవన్ కళ్యాణ్ గారికి మన ఇరు రాష్ట్రాల నుండే కాకా పలు రాష్త్ర లలో కూడా అభిమానులు ఉన్నారండి. అయన స్టైల్ ని ప్రతి ఒకరు అనుకరిస్తారు. ఆయన డైలాగ్ డెలివరీ ఒక రకమైన వైబ్రేషన్ ని మనకు అందిస్తుంది. ఏ పాత్ర కి అయినా 100 % న్యాయం చెయ్యగల దిట్ట మన పవన్ స్టార్.

జన సేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కోసం జార్జిరెడ్డిచిత్ర బృందం ఒక ప్రత్యేక పాటను విడుదల చేసింది. హే సమరం మనది అయితే విజయం మనదే కదా. కలలే కడలి ఒడిలో అలలై ఎగిసే కదా పాటను పవన్ కళ్యాణ్ రాజ కీయ ప్రయాణాలకు సంబందించిన కొన్ని వీడియోస్ ని జతచేసి ఈ పాటను రూపొందించారు. ఈ పాటను సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తూ విజయం పాట మొదటి కట్ ను పవన్ కళ్యాణ్ గారికి అంకితం ఇస్తున్నాము అని చిత్ర బృందం తెలిపారు.

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijayam Song  Pawan Kalyan  George Reddy  

Other Articles

Today on Telugu Wishesh