Article 370 పై తేజ గారి పట్టుదల.. Director Teja Focusing On Article 370 Now

Director teja focusing on article 370 now

Director Teja, Article 370

Director Teja Focusing On Article 370 Now

Article 370 పై తేజ గారి పట్టుదల..

Posted: 11/13/2019 09:50 AM IST
Director teja focusing on article 370 now

నేనే రాజు నేనే మంత్రి చిత్రం తర్వాత . చాల మంది  అనుకున్నారు డైరెక్టర్ తేజ  మళ్ళీ తన  సినిమాలతో మనల్ని కనువిందు చేయబోతున్నారని..  ఎంత త్వరగా ఫామ్లోకి  వచ్చారో అంతే త్వరగా వెళ్లిపోయారు..నేనే రాజు నేనే మంత్రి వంటి రొమాంటిక్ పొలిటికల్ డ్రామాతో మనల్ని ఎంతగానో ఆకట్టుకున్న తేజ గారు తన తదుపరి చిత్రం సీతతో తన ప్రేక్షక బృందాన్ని  అసంతృప్తి  పరిచారు.. ఇరు చిత్రాలలోను నటించిన మన మిత్రవింద తన నటన కౌశల్యతను కనబరిచారు.. ఇప్పుడు మరలా తన వినూత్నమైన కథాంశాలతో రానున్నారు..ఏది ఏమైనా హిట్ ప్లాప్  అనే అంశాలను పక్కకు పెడితే తేజ గారి చిత్రాలలో నవీన అంశాలు..కథ,కథనాయికలు వారి అరుదైన నటన మాధుర్యతను మనము ఆస్వాదించవచ్చు. ప్రతి చిత్రంలో ఏదో ఒక అంశం అది కూడా యువతకు  చేరువయ్యేలాగ  ఉంటుంది.. ప్రేమకథ చిత్రాలకు తేజ గారి మార్క్ ఉండాల్సిందే..జయం సినిమా ఎంత ఆదరణ పొందిందంటే ఆ చిత్రం మన సినీపరిశ్రమలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టుకుంది ..అందులో నటించిన కథనాయకుడు, నాయికలు నేడు మంచి పేరుతో సినీ చిత్ర వినీల ఆకాశంలో తిరుగా డుతున్నారు.. చాల మంది నటీ నటులు తమ గురువుగా భావిస్తారు..అంతేకాకుండా చాల మంది సినీ ప్రస్థానానికి నాంది పలికారు.. ఈసారి మన తేజ గారు తన వైఖరిని మార్చుకొని జమ్మూ కాశ్మీర్ నేపథ్యం పై కథను తెరపైకి తేనున్నారు.. ఆర్టికల్ 370 ని బేస్ చేసుకొని చిత్రం ఉండబోతుంది అని సినీ వర్గ గుసగుసలు.. అందుకే ఆ చిత్రానికై ఎంతో పరిశోధనలు చేయనున్నారు. సహజంగా కాశ్మీర్ కి దూరంగా ఉంటున్న మన దక్షిణ భరత దేశ ప్రజలకు కొద్దిగా కష్టమమైన పరిస్థితి అక్కడి సాంఘిగా -  సంస్కృతి లా గురించి తెలియాలంటే ..కానీ మన తేజ గారు ఎంతో దైర్యం చేసి తెలుగు మరియు హిందీ భాషలలో చిత్రీకరించనున్నారు.. నిజం చెప్పాలంటే ఇంతవరకు తేజ గారు ఇటువంటి పెద్ద పెద్ద  రాజకీయాల నేపధ్య సినిమాలు తీయ్య లేదు.. అందుకేనేమో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం నుండి తప్పుకున్నారు.. అయినా ఈసారి గట్టి పట్టుదలతో ఉన్నారు ఆర్టికల్ 370 చిత్రాన్నీ తియ్యడానికి.. అంతే ఆతురతతో ఉన్నారు ఆయన అభిమానం సామ్రాజ్యం కూడా..

-శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director Teja  Article 370  

Other Articles