Anushka's Nishabdham teaser is intriguing! ఆసక్తిరేపుతున్న అనుష్క ‘నిశ్శబ్దం’ టీజర్

Nishabdham teaser anushka shetty madhavan film is spooky

Nishabdham, nishabdham teaser, Anushka Shetty, R Madhavan, Anjali, Shalini Pandey, Hemant Madhukar, Kollywood, Tollywood, movies, entertainment

A teaser of Anushka Shetty and R Madhavan's Nishabdham was unveiled today. The clip of the horror-thriller hints at a leisurely vacation ending with a mysterious murder. Anushka plays Sakshi, a "mute artist", while Madhavan is Anthony, a "celebrity musician".

ఆసక్తిరేపుతున్న అనుష్క ‘నిశ్శబ్దం’ టీజర్

Posted: 11/06/2019 07:19 PM IST
Nishabdham teaser anushka shetty madhavan film is spooky

అగ్ర కథానాయిక అనుష్క అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. గురువారం ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ‘నిశ్శబ్దం’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సినిమా టీజర్‌ను రూపొందించారు. ఇందులో అనుష్క దివ్యాంగురాలిగా కనిపించారు. సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. విహారయాత్ర పీడకలైందని టీజర్‌లో పేర్కొన్నారు.

హేమంత్ మధుకర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మాధవన్‌, షాలినీ పాండే, అంజలి, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన వెంకట్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది. ‘భాగమతి’ హిట్‌ తర్వాత స్వీటీ నటిస్తున్న సినిమా ఇది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles