Puri Jagannadh busy with romantic movie తనయుడికి ‘రోమాంటిక్’ హిట్టిచే పనిలో పూరీ.!

Puri jagannadh busy with romantic movie

Romantic first look evokes a mixed reaction, Romantic, Romantic First Look, Akash Puri, Ketika Sharma, Anil Paduri, Charmee, Puri Jaganandh, tollywood , Movies, Entertainment

After the first look of ‘Romantic’ movie starring Akash Puri and Ketika Sharma in the lead roles was released, director Puri Jagannath is busy with his son Akash movie.

తనయుడికి ‘రోమాంటిక్’ హిట్టిచే పనిలో పూరీ.!

Posted: 10/03/2019 10:20 PM IST
Puri jagannadh busy with romantic movie

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ .. నటి చార్మీ కలసి నిర్మించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం సూపర్ హిట్ కావడంతో అదే కాంబినేషన్ లో మరో క్రేజీ మూవీని ప్లాన్ చేస్తున్నారు వీరిద్దరూ. పూరి జగన్నాథ్ తనయుడు అకాశ్ హీరోగా 'రొమాంటిక్' సినిమాను నిర్మిస్తున్నారు. ఆకాశ్ పూరి కథానాయకుడిగా అనిల్ పాదూరి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు కేతిక శర్మ కథానాయికగా పరిచయం కానుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టులుక్ పోస్టర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా విశేషాలు తెలుసుకోవడానికి యూత్ ఎంతో ఆసక్తిని చూపుతోంది.

ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాదులో ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మాఫియాతో ముడిపడిన ప్రేమకథగా ఈ సినిమా సాగుతుందని అంటున్నారు. కీలకమైన పాత్రల్లో బాలీవుడ్ కి చెందిన మకరంద్ దేశ్ పాండే .. మందిరా బేడీ కనిపించనున్నారని చెబుతున్నారు. ఈ సినిమాతో ఆకాశ్ కి హిట్ ఇవ్వాలనే పూరి ప్రయత్నం ఎంతవరకూ నెరవేరుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Romantic  Akash Puri  Ketika Sharma  Anil Paduri  Charmee  Puri Jaganandh  tollywood  

Other Articles