Gopichand on Chanakya release post Sye Raa ‘సైరా’ వారంలోనే ‘చాణక్య’ విడుదలపై గోపిచంద్ స్పందన

Gopichand on releasing chanakya 3 days post chiranjeevi s sye raa

sye raa, sye raa chiranjeevi, 3 days post sye raa movie, chanakya lyrical songs, gopichand, mehreen pirzada, zareen khan, thiru, chanakya movie songs, gopichand on chanakya release, gopichand on sye raa, gopichand new movie, chanakya movie, chanakya teaser, chanakya trailer, Mehreen Pirzada, tollywood, movies, entertainment

Tollywood action Hero Gopichand responded on releasing his movie chanakya three days post chiranjeevi's sye raa in an interview promoting his movie.

‘సైరా’ వారంలోనే ‘చాణక్య’ విడుదలపై గోపిచంద్ స్పందన

Posted: 09/30/2019 09:19 PM IST
Gopichand on releasing chanakya 3 days post chiranjeevi s sye raa

'తిరు' దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా 'చాణక్య' సినిమా రూపొందుతోంది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ స్పై థ్రిల్లర్ ను వచ్చేనెల 5వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ వర్క్ లో బిజీగా పాల్గోంటున్న హీరో గోపిచంద్.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మరో చారిత్రక చిత్రం అందులోనూ మెగాస్టార్ నటించిన చిత్రం విడుదల నేపథ్యంలో తన చిత్రం విడుదల కావడంపై స్పందించారు.

ఈ విషయమై తాజాగా ఓ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'సైరా' సినిమాకి చాలా దగ్గరలో 'చాణక్య' విడుదల చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అయితే 'చాణక్య'ను ముందుగా మేము 'మే' నెలలో విడుదల చేయాలని అనుకున్నామని.. అయితే చిత్ర షూటింగ్ లో తాను ప్రమాదానికి గురికావడంతో చిత్ర విడుదల వాయిదా పడిందని చెప్పాడు. ఈ చిత్రాన్ని తాము అక్టోబర్ 3న విడుదల చేయాలని ముందుగానే అనుకున్నామన్నారు.

అప్పటికి ఇంకా 'సైరా' సినిమా రిలీజ్ డేట్ ఖరారు కాలేదని తెలిపాడు. 'సైరా'ను అక్టోబర్ 2వ తేదీకి ఫిక్స్ చేసిన తరువాత, మేము అక్టోబర్ 3 నుంచి 5కి వెళ్లాము. పండుగ సెలవులు ఎక్కువగా ఉండటం వలన, 'సైరా' జోనర్ .. 'చాణక్య' జోనర్ వేరు వేరు కావడం వలన మా సినిమాకి ఎలాంటి ఇబ్బంది ఉండదనే భావిస్తున్నాము" అని చెప్పుకొచ్చాడు.  అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో, జరీన్ ఖాన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. కొంతకాలంగా గోపీచంద్ వెయిట్ చేస్తోన్న హిట్, ఈ సినిమాతో ఆయనకి లభిస్తుందేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopichand  chanakya  Chiranjeevi  sye raa  ram charan  mehreen pirzada  zareen khan  tollywood  

Other Articles

Today on Telugu Wishesh