Comedian Venu Madhav in passes away నవ్వులరేడు కమేడియన్ వేణుమాధవ్ ఇకలేరు

Telugu comedian venu madhav passes away at 40

Comedian Venu Madhav, Dr. Paramanandaiah’s Students Gang, Sampradayam, secunderabad, Venu Madhav, Venu Madhav age, Venu Madhav comedy, Venu Madhav dead, Venu Madhav death, Venu Madhav dies, Venu Madhav news, Venu Madhav passes away, Venu Madhavdeath today, venu madhav latest news, tollywood Comedian, tollywood, movies,entertainment

Popular Telugu actor Venu Madhav, 39, breathed his last at a private hospital in Secunderabad, Hyderabad. He has been suffering from kidney-related ailments for a while now.

నవ్వుల రేడు వేణుమాధవ్ ఇకలేరు.. అనారోగ్యంతో కన్నుమూత

Posted: 09/25/2019 02:50 PM IST
Telugu comedian venu madhav passes away at 40

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ నవ్వులరేడు.. వేణుమాధవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న ఆయన సికింద్రాబాద్‌లోకి యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటలకు కాప్రాలోని హెచ్‌బీ కాలనీ మంగాపురంలో ఉన్న వేణుమాధవ్ స్వగృహానికి ఆయన మృతదేహాన్ని తరలించారు కుటుంబసభ్యులు.

కాగా, వేణుమాధవ్‌కు భార్య శ్రీవాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేణుమాధవ్ స్వస్థలం సూర్యపేట జిల్లా కోదాడ. 1968 సెప్టెంబర్ 28న ఆయన జన్మించారు. మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వేణుమాధవ్.. తెలుగు ప్రేక్షకులు మెచ్చిన హాస్యనటుడిగా ఎదిగారు. గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న వేణుమాధవ్ రాజకీయాల్లోనూ కాలుమోపారు. రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించి.. టీడీపీ పార్టీకి నమ్మినబంటుగా వుండిపోయారు. నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసి వార్తల్లో నిలిచారు.

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, ఆయన నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించడంతో కుదరలేదు. అప్పటికి వేణుమాధవ్ ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే, గతకొద్ది నెలల క్రితం ఆయన సజీవంగా వుండగానే కొన్ని వెబ్ సైట్లు ఆయన మరణించాడని వార్తలు ప్రచురించాయి. దీని వెనుక పెద్ద కుట్ర వుందని అరోపించిన ఆయన ఈ విషయమై పోరాటం కూడా చేశారు. తన మరణవార్తను ప్రచురించిన వైబ్ సైట్లపై చర్యలు తీసుకోవాలని ఏకంగా గవర్నర్ కు కూడా పిర్యాదు చేశారు.

వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషయమై సమాచారం అందుకున్న సినీ నటులు జీవిత, రాజశేఖర్ మంగళవారం సాయంత్రమే యశోదా ఆసుపత్రికి చేరుకుని ఆయనను పరామర్శించారు.  వేణుమాధవ్ అరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇంతలోనే ఆయన తిరిగిరాని లోకాలకు తరలివెళ్లిపోవడంతో టాలీవుడ్ పరిశ్రమలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. అనునిత్యం నవ్వుతూ నవ్విస్తూ వుండే నల్లబాలు ఇక లేడని, మరల రాడని సినీప్రముఖులు శోకసంధ్రంలో మునిగిపోయారు.

కాగా.. శివాజీరాజా, అలీ, ఉత్తేజ్ యశోద హాస్పిటల్‌కు వెళ్లి వేణుమాధవ్ మృతదేహాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వేణుమాధవ్ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆయన ఇంటి వద్ద సాయంత్రం 5 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంచుతామన్నారు. ఆ తరవాత ఫిల్మ్ ఛాంబర్ వద్ద నివాళులర్పించడానికి రేపు మధ్యాహ్నం 1 నుంచి 2.30 గంటల వరకు ఉంచుతామని చెప్పారు. సాయంత్రం మౌలాలిలో అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి సంతాపం

వేణుమాధవ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వేణుమాధవ్ అకాల మరణం పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేసిన ఆయన.. వేణు మాధవ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వేణుమాధవ్ తరలివెళ్లిపోవడం సినీపరిశ్రమకు తీరని లోటని చిరంజీవి అన్నారు. ‘‘వేణుమాధ‌వ్ తొలిసారి నాతో క‌లిసి ‘మాస్టర్’ సినిమాలో న‌టించాడని గుర్తు చేసుకున్నారు.

ఆ తరువాత ప‌లు సినిమాల్లో న‌టించి హాస్యన‌టుడిగా త‌న‌కంటూ ప్రత్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్నాడని అలాంటి ఆయన అనారోగ్యం కారణంగా కన్నుమూయడం దేవుడు చిన్నచూపు చూడటమేనని అవేదన వ్యక్తం చేశారు. కొన్ని పాత్రలు త‌న‌కోసమే పుట్టాయ‌న్నంతగా వేణు న‌టించేవాడు. ఆ పాత్రకే వ‌న్నే తీసుకొచ్చేవాడు. వ‌య‌సులో చిన్న వాడు. సినీ ప‌రిశ్రమ‌లో త‌న‌కింకా బోలెడంత భ‌విష్యత్ ఉంద‌ని అనుకునే వాడిని. కానీ, దేవుడు చిన్న చూపు చూసాడు. ఆయ‌న ఆత్మకు శాంతి చేకూర‌ల‌ని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

జనసేనాని పవన్ కల్యాణ్ సంతాపం

అంతకుముందు జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వేణుమాధవ్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా వేణుమాధవ్ తో తన సినీ ప్రయాణాన్ని పవన్ గుర్తుచేసుకున్నారు. వేణు మంచి హాస్యనటుడని, టైమింగ్ వున్న ఆర్టిస్టని.. మిమిక్రీలో కూడా నైపుణ్యం ఉండటంతో సెట్‌లో అందరినీ నవ్వించేవారని వెల్లడించారు. ఈ మేరకు వేణుమాధవ్ మృతికి సంతాపం తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venu madhav  comedian  passes away  yashoda hospital  chiranjeevi  pawan kalyan  jeevitha  tollywood  

Other Articles