తొలితరం స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారాంగా.. మెగాస్టార్ చిరంజీవి నటించిన 151 వ సినిమా సైరా అక్టోబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. తన తండ్రికి చిరకాలం గుర్తుండిపోయే, ఒక గర్వకారణమయిన గిఫ్ట్ అందించాలని బడ్జెట్ విషయంలో వెనుకాడకుండా, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా 'సైరా'ని నిర్మించాడు. షూటింగ్ పూర్తయిపోయి చాలాకాలం అయినా కూడా టీమ్‌ని టెన్షన్ పెట్టకుండా పోస్ట్‌ప్రొడక్షన్ కి చాలా టైమ్ ఇచ్చాడు.
ఇప్పుడు అంతా ఓకే అనుకుని సైరాని రిలీజ్‌కి రెడీ చేశారు. అయితే ఈ సినిమా బడ్జెట్ 250 కోట్లు అనేది అఫీషియల్‌గా బయటకు వచ్చింది. కానీ లేటెస్ట్ టాక్ ఏంటంటే ఇప్పడు అన్నీ లెక్కలు కడితే ఏకంగా 300 కోట్లవరకు ఖర్చు తేలుతుంది అంటున్నారు. అయినా కూడా రామ్‌చరణ్ కాస్త లిబరల్ రేట్లకే ఈ సినిమాని అమ్ముతున్నాడు. సినిమా మీద నమ్మకం ఉండడంతో అవుట్‌రేట్ బేసిస్ మీద కాకుండా నాన్‌రిటర్నబుల్ అడ్వాన్సులమీదే సినిమా ఇస్తున్నారు.
సైరా ఓవర్సీస్ రైట్స్‌ని రామ్ చరణ్ ఫైనల్‌గా 18 కోట్లకు సినిమా విక్రయించారు. మెగాస్టార్ స్టామినాకి, అక్కడ ఈ సినిమాకి ఉన్న హైప్‌కి ఈ అమౌంట్ రికవర్ చెయ్యడం చాలా ఈజీ. ఈ రేంజ్ సినిమాకి ఆ రేటు చాలా సేఫ్ బెట్. హిట్ టాక్ వస్తే వసూళ్ల వరద మామూలుగా ఉండదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయిన ఖైదీ నంబర్ 150కే అక్కడ బాక్సాఫీస్ షేక్ అయ్యే రేంజ్‌లో కలెక్షన్స్ వచ్చాయి.సైరాకి ఏ రేంజ్ ఓపెనింగ్స్ ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కూడ సైరా బిజినెస్ డీల్స్ పూర్తయ్యాయి. డీల్ వివరాల్లోకి వెళ్తే..
ఏరియాల వారిగా సైరా బిజినెస్
నైజాం 30 కోట్లు (తిరిగి చెల్లించబడని అడ్డాన్స్)
ఉత్తరాంధ్ర 14.40 కోట్లు (తిరిగి చెల్లించబడని అడ్డాన్స్)
గుంటూరు 11.50 కోట్లు (తిరిగి చెల్లించబడని అడ్డాన్స్)
సీడెడ్ 20 కోట్లు (తిరిగి చెల్లించబడని అడ్డాన్స్)
ఈస్ట్ 10.40 కోట్లు (తిరిగి చెల్లించబడని అడ్డాన్స్)+ రికవరబుల్ అడ్వాన్స్ 60 లక్షలు)
వెస్ట్ 9 కోట్లు (తిరిగి చెల్లించబడని అడ్డాన్స్ + రికవరబుల్ అడ్వాన్స్ 60 లక్షలు)
కృష్ణా 9.6 కోట్లు (తిరిగి చెల్లించబడని అడ్డాన్స్ + రికవరబుల్ అడ్వాన్స్ 60 లక్షలు)
నెల్లూరు 5.2 కోట్లు (తిరిగి చెల్లించబడని అడ్డాన్స్ + రికవరబుల్ అడ్వాన్స్ 40 లక్షలు)
మొత్తం 110.10 కోట్లు (ఏపీ + తెలంగాణ)
ఓవర్సీస్ 18 కోట్లు
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more