'Valmiki' shows Varun Tej in new avatar ‘వాల్మీకి’ తన పేరును రివీల్ చేసిన మెగా ప్రిన్స్

Valmiki trailer varun tej is gangster gaddala konda ganesh

Tollywood News,Varun Tej,Valmiki Trailer,valmiki,trailer,release date,Pooja Hegde,Mrinalini Ravi,Mickey J Meyer,Harish Shankar,Atharvaa Murali, Tollywood, Entertainment, movies, Bollywood

Valmiki trailer starring Varun Tej as Gaddala Konda Ganesh just had its trailer release and it is lit with action sequences of the don world.

‘వాల్మీకి’లో తన పేరును రివీల్ చేసిన మెగా ప్రిన్స్

Posted: 09/09/2019 05:27 PM IST
Valmiki trailer varun tej is gangster gaddala konda ganesh

మెగా కుటుంబం నుంచి తెలుగువెండి తెరకు పరిచమైన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి విభిన్నమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ అలాంటి చిత్రాలను, కథలను ఎంచుకుని మరీ నటిస్తున్నాడు. అలా కొత్తదనానికి ప్రాధాన్యతస్తున్న ఆయన తాజాగా నటించిన చిత్రమే 'వాల్మీకి'. రోటిన్ గెటప్ కు భిన్నంగా ఈ చిత్రంలో వరున్ లుక్ మాస్ ఆడియన్స్ ను అకర్షిస్తోంది.

హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. తన కెరీర్ లో మునుపెన్నడూ లేని విధంగా గుబురు గడ్డంతో చేతిలో గన్ తో కనిపిస్తున్న వరణ్ తేజ్ లుక్ మెగా అభిమానులను భలే అకట్టుకుంటుంది. పోస్టర్స్ లో వరుణ్ గెటప్ చూసిన వాళ్లంతా ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు ఏదై ఉంటుందా అనే ఆత్రుతను కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులను ఉత్కంఠకు గురిచేయడం ఇష్టంలేని వరుణ్ తేజ్ తన పాత్ర పేరును వెల్లడించాడు.

అదెలా అంటే ఇవాళ విడుదలైన ఈ చిత్ర ట్రైయిలర్ లో తన తన పాత్ర పేరు 'గద్దలకొండ గణేశ్' అని రివీల్ చేశాడు మెగా ప్రిన్స్.
అచ్చంగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ మన మీద పందేలేస్తే పైసలోస్తాయ్.. నాతోటి పందాలేస్తే చస్తరు. అంటూ పంచు డైలాగులు బాగానే అకర్షిస్తున్నాయి. మనం బతుకుతున్నట్లు పది మందికి తెలువకపోతే మన బతికుడెందుకురా..కూడా చిత్రం అంచణాలను బాగానే పెంచేసింది.

జిందగీ తమ్మీ ఉత్త గీతలే మన చేతులుంటాయ్.. రాతలు మన చేతులుండయ్.. గవాస్కర్ సిక్స్ కొట్టుడు.. బప్పిలహరి పాట కొట్టుడు నేను బొక్కలిరడగొట్టుడు సేమ్ టు సేమ్.. అదే పాషన్. అనే డైలాగ్ ఏం రోవ్ అనే ఊతపదం అన్ని కలసి చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి, ఈ పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పాడు. ఈ నెల 20వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో ఒక కథానాయికగా పూజా హెగ్డే, మరో కథానాయికగా మృణాళిని రవి నటించారు. తమిళ హీరో అధర్వ మురళి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనుండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Tej  Valmiki  Pooja Hegde  Mrinalini Ravi  Mickey J Meyer  Harish Shankar  Tollywood  

Other Articles