Director Rajashekar passes away దర్శకుడు, నటుడు రాజశేఖర్ కన్నుమూత..

Senior actor and director rajashekar passes away at 62

Director Rajashekar, kollywood director, rajashekar kollywood director, Director, rajashekar, rajasekhar,actor rajasekhar, cimena actor rajasekhar, tamil actor rajasekhar, popular tamil actor rajasekhar passes away, Rajashekar, passed away, ill health, tamil serials, kollywood celebrities, Kollywood, movies, entertainment, tollywood

Well-known character artist and famous Director Rajashekar, 62, passed away at a private hospital. The actor and directoe, who was reportedly unwell for some time was undergoing treatment since few days.

కాలీవుడ్ లో విషాదం.. దర్శకుడు, నటుడు రాజశేఖర్ కన్నుమూత..

Posted: 09/09/2019 10:03 AM IST
Senior actor and director rajashekar passes away at 62

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు రాజశేఖర్(62) కన్నుమూశారు. చెన్నైలోని వలసరవాక్కంలో నివాసం ఉంటున్న రాజశేఖర్ ఇటీవల అస్వస్థతకు గురై స్థానిక ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆయన క్రితం రోజు రాత్రి తుదిశ్వాస విడిచారు. రాజశేఖర్ దర్శకుడిగా తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. పలైవనచోలై, చిన్నపూవే మెల్ల పెసు తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.

చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థి అయిన రాజశేఖర్ తొలిసారి భారతీరాజా దర్శకత్వం వహించిన నిగల్‌గల్ (1980) చిత్రంలో నటించారు. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్‌ రాబర్ట్‌ సహచర్యంతో దర్శకుడిగా మారారు. ఒరు తాలై రాగం, మనసుక్కుల్ మతప్పు వంటి చిత్రాలు ఈ కాంబినేషన్‌కు మంచి పేరు తెచ్చాయి. రెండేళ్ల క్రితం రాబర్ట్ కన్నుమూశారు. దీంతో రాజశేఖర్ మళ్లీ నటన వైపు వచ్చారు.

కాగా, శరవణన్ మీనాక్షి సీరియల్‌లో హీరో తండ్రి పాత్రలో అద్భుత ప్రదర్శన కనబరిచారు. దీంతో అప్పట్నించి ఆయన ఎక్కువగా తమిళ టీవీ సీరియల్స్‌కే పరిమితమవుతూ వచ్చారు. ఇదిలా ఉండగా.. రాజశేఖర్ మృతితో కాలీవుడ్ పరిశ్రమ విషాదంలో మునిగింది. ఆయన మృతి పట్ల తమిళ సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director  Rajashekar  passed away  ill health  tamil serials  kollywood celebrities  condolence  Kollywood  

Other Articles