saaho grosses Rs 125 crore worldwide తొలిరోజునే శతకం బాదిన ప్రభాస్ ‘సాహో’

Prabhas shraddha starrer grosses rs 125 crore worldwide

Box Office,Saaho box office collection,Saaho first day collection,Saaho opening day response,Saaho Rs 100 crore gross mark,Saaho total worldwide collection,All time biggest opener Indian films,Prabhas,Shraddha Kapoor,Baahubali 2,Saaho areas wise earnings,Saaho day 1 distributors share, Bollywood, Tollywood, movies, entertainment

Prabhas and Shraddha Kapoor's Saaho has collected over Rs 125 crore gross mark at the worldwide box office on the first day and become the second biggest opener of all time after Baahubali 2.

ప్రపంచవ్యాప్తంగా తొలిరోజునే శతకం బాదిన ప్రభాస్ ‘సాహో’

Posted: 08/31/2019 07:08 PM IST
Prabhas shraddha starrer grosses rs 125 crore worldwide

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లపై విడుదలైన తెలుగు సినిమా ‘సాహో’ తొలిరోజున బాక్సాఫీసు వద్ద సెంచరీ కొట్టింది. ఈ చిత్రం ఓపెనింగ్‌ రోజున రూ.130 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు వెల్లడించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో రూ.42 కోట్లు సాధించిందని పేర్కొన్నారు. అమెరికాలో సినిమా మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో అడుగుపెట్టిందని తెలిపారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సాహో’ మంచి టాక్‌ అందుకుంది. ‘బాహుబలి’ హిట్‌ తర్వాత ప్రభాస్‌ నటించిన సినిమా ఇది. సుజీత్‌ దర్శకుడు. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది.

బాలీవుడ్‌లోనూ సత్తాచాటారు
ఈ సినిమా బాలీవుడ్‌లోనూ సత్తా చాటింది. అక్కడ శుక్రవారం రూ.24.40 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ క్రమంలో 2019 బాలీవుడ్‌లో దేశవ్యాప్తంగా తొలిరోజున అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల జాబితాలో ‘సాహో’ మూడో స్థానంలో చేరింది. రూ.42.30 కోట్లతో సల్మాన్‌ ఖాన్‌ ‘భారత్’ సినిమా ఈ వరుసలో ప్రథమ స్థానంలో ఉంది. ఆ జాబితాను ఓ సారి చూద్దాం..
1. భారత్’ రూ.42.30 కోట్లు
2. మిషన్‌ మంగళ్‌: రూ.29.16 కోట్లు
3. సాహో(హిందీ) : రూ.24.40 కోట్లు
4. కళంక్‌: రూ.21.60 కోట్లు
5. కేసరి: రూ.21.06 కోట్లు వసూలు చేశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles