ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్.. యంగ్ హీరో రామ్ పోతినేనితో కలసి తన మార్కు మాస్ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ను రూపొందించడంతో అది కాస్తా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వరదను రాబట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 18వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్ద సవ్వడే చేసింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా తన జోరును కొనసాగించింది.
రామ్ మాస్ డైలాగ్స్ .. మాస్ బీట్స్ .. హీరోయిన్స్ గ్లామర్ ఈ సినిమా వసూళ్లలో ప్రధానమైన పాత్రను వహిస్తున్నాయి. ఇక దీనికి తోడు పూరి మాస్ డైలాగులు .. రామ్ నటన - డాన్స్ .. మణిశర్మ మ్యూజిక్.. నభా - నిధి గ్లామర్ ఈ స్థాయి వసూళ్లకు కారణమంటున్నారు. దీంతో ఈ సినిమా విడుదలైన 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 63 కోట్ల గ్రాస్ ను సాధించింది.
అయితే తొమ్మిది రోజుల వరకు జోరు కొనసాగించిన ఈ చిత్రం పదో రోజు నుంచి తన దూకుడు తగ్గించుకుంది. విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం విడుదల కావడం కూడా అందుకు కారణంగా కావచ్చు. మొత్తానికి పక్షం రోజుల తరువాత ఇస్మార్ట్ శంకర్ చిత్రం మొత్తంగా రూ.70 కోట్ల గ్రాస్ ను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more