Ismart Shankar clocked 50 crore club ! 50 కోట్ల క్లబ్ లో చేరిన ఇస్మార్ట్ శంకర్

Ismart shankar day 6 collections ram pothineni unstoppable at box office

Ismart Shankar, puri jagannath, Ram potheneni, Charmee, Rs 50 cr club, mani sharma, nabha natesh, niddhi, ismart shankar collections, ismart shankar box office, dear comrade, entertainment, movies, tollywood

Puri Jagannath has made his film ‘Ismart Shankar’ as Ram starrer. Released on the July 18th, the film has been well received by the audience. Co-producer and Actress Charmee has tweeted that the film has grossed over Rs 56 crore.

50 కోట్ల క్లబ్ లో చేరిన ఇస్మార్ట్ శంకర్

Posted: 07/24/2019 09:05 PM IST
Ismart shankar day 6 collections ram pothineni unstoppable at box office

చాలా కాలం తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ మంచి హిట్ కొట్టారు. రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే ఈ సినిమా వ్యక్తి మెదడును మార్పిడి చేయడమనే కాన్సెప్ట్‌తో రూపొందిందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్ర్కిప్ట్ విషయంలోనూ పలు అరోపణలు వచ్చినా.. వసూళ్లలో మాత్రం దాని ప్రభావం కనిపించడం లేదు.

ఈ నెల 18వ తేదీన విడుదలైన ఈ సినిమాకి, మాస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మాస్ డైలాగులతో పాటు మణిశర్మ అందించిన మాస్ మ్యూజిక్, మాస్ బాణీలు కూడా ప్రేక్షకులను రంజింపజేశాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం మాస్ అడియన్స్ ను బాగా ఆకర్షిస్తోంది.

6 రోజులలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 56 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టుగా చార్మీ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. పూరి మాస్ డైలాగులు .. రామ్ నటన - డాన్స్ .. మణిశర్మ మాస్ బీట్స్ .. నభా - నిధి గ్లామర్ ఈ స్థాయి వసూళ్లకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'డియర్ కామ్రేడ్' థియేటర్లకు వచ్చేవరకూ, 'ఇస్మార్ట్ శంకర్' కి తిరుగులేదు. అందువలన వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ismart Shankar  puri jagannath  Ram potheneni  Charmee  Rs 50 cr club  tollywood  

Other Articles