సినీ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్ ను మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. మురళీమోహన్ ఇటీవలే వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి, హైదరాబాదులో ఉన్న తన నివాసంలో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, తన భార్య సురేఖతో కలసి మురళీమోహన్ ఇంటికి చిరంజీవి వెళ్లారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ నేపథ్యంలో ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. అందులో మాట్లాడుతూ.. ‘గత నెల 14న మా అమ్మగారి అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేసేందుకు అలహాబాద్ వెళ్లాను. అక్కడ నిమజ్జనం చేస్తుండగా నా రెండు కాళ్లు పట్టేశాయి. నడవలేకపోయా. వెంటనే హైదరాబాద్ కు వచ్చి కేర్ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకున్నా. దీంతో వెన్నుపూసలో ఎల్4, ఎల్5 ప్రాంతాల్లో తేడాలు ఉన్నాయి. ఆపరేషన్ చేయాలండి. ఎంత తొందరగా చేస్తే అంత మంచిది అని చెప్పారు’
‘గత నెల 24న ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. నిన్నరాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాను. ఈ నెల 7న కుట్లు తీస్తారు. శరీరాన్ని కష్టపెట్టవద్దని డాక్టర్లు సూచించారు. నా ఆరోగ్యం సహకరిస్తే అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అందరినీ నేనే ఈ నెల 10 తర్వాత కలుస్తా. లేదంటే ఒకరితర్వాత ఒకరు వచ్చి కలిస్తే నాకు ఇబ్బందేం లేదు. నా ఆరోగ్యం ప్రస్తుతం బాగుంది. ఎవరూ ఆందోళన చెందవద్దు’ అని వీడియోలో మురళీ మోహన్ కోరారు.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more