ప్రముఖ సినీ గాయని శ్రేయా ఘోషల్ కు చేదు అనుభవం ఎదురైంది. సింగపూర్ లో పర్యటించిన ఆమె స్వదేశానికి వస్తున్న క్రమంలో అమెకు చేధు అనుభవం ఎదురైంది. చివరకు చేసేది లేక అమె సింగపూర్ విమానాశ్రయంలోనే తాను ఎంతో ముచ్చటపడి కొనుకున్న విలువైన వస్తువును ఎటూతేల్చుకోలేక విమానాశ్రయంలోనే వదిలేసి రావాల్సివచ్చింది. అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే, సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో ఆమె సింగపూర్ నుంచి భారత్ కు బయల్దేరింది. ఆ సమయంలో తనతో పాటు ఓ వాయిద్య పరికరాన్ని కూడా తీసుకొచ్చింది.
అయితే, పరికారాన్ని విమానంలోకి తీసుకురాకూడదని ఎయిర్ లైన్స్ సిబ్బంది ఆమెకు చెప్పారు. తప్పని పరిస్థితుల్లో విమానాశ్రయంలోనే దాని ఆమె వదిలేసింది. ఆ తర్వాత సింగపూర్ ఎయిర్ లైన్స్ పై ట్విట్టర్ ద్వారా ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసింది. విలువైన వాయిద్య పరికరాలు ఉంటే సింగపూర్ ఎయిలైన్స్ విమానంలోకి ఎక్కనివ్వదేమో అంటూ ఎద్దేవా చేసింది. తనకు గుణపాఠం నేర్పినందుకు ధన్యవాదాలు అంటూ విమర్శించింది. ఆమె ట్వీట్ కు సింగపూర్ ఎయిర్ లైన్స్ చేతులు కాలిన తరువాత స్పందించింది.
సింగర్ శ్రేయా ఘోషల్ చేధు అనుభవంపై స్పందించిన ఎయిర్ లైన్స్ యాజమాన్యం.. అమెకు అలాంటి అనుభవాన్ని మిగిల్చినందుకు చింతిస్తున్నామని చెప్పింది. కాగా తమ సిబ్బంది మీతో ఏమన్నారో వివరంగా చెప్పాలని కోరింది. ఇలా విమానయాన సంస్థ యాజమాన్యం దిగివచ్చేందుకు శ్రేయా ఘెషల్ అభిమానులే కారణం. తీవ్రమైన పరిస్థితుల్లో తప్ప అమె సహజంగా ఎప్పుడూ ఒకర్ని విమర్శించేలా, లేదా కించపర్చేలా పోస్టులు పెట్టదని తెలుసుకున్న అభిమానులు అమెకు మద్దతుగా ట్వీట్ చేయడంతో యాజమాన్యం దిగివచ్చింది.
I guess @SingaporeAir does not want musicians or any body who has a precious instrument to fly with on this airline. Well. Thank you. Lesson learnt.
— Shreya Ghoshal (@shreyaghoshal) May 15, 2019
(And get your daily news straight to your inbox)
Jan 25 | మ్యాన్లీ స్టార్ శ్రీకాంత్, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోలుగా తాన్యా హోప్ హీరోయిన్ గా భూమిక చావ్లా ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం “ఇదే మాకథ”. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గురప్పా పరమేశ్వర... Read more
Jan 25 | ప్రస్థానం చిత్రంతో రాజకీయాల పట్ల తనకు ఎంతటి అవగాహన వుందో ఇట్టే చాటుకున్న దర్శకుడు దేవ కట్టా. అటు రాజకీయాలతో పాటు ఇటు ప్రజాస్వామ్యంపై ఆయన వున్న అలోచనల నేపథ్యంలో ఆయన సినిమా కథలు... Read more
Jan 25 | దర్శకధీరుడు, తెలుగు ప్రేక్షకులు అభిమానంతో జక్కనగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి.. బహుబలి చిత్రాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన అప్... Read more
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more