akhil akkineni movie to go on sets mid next month రోమాంటిక్ లవ్ స్టోరీతో సెట్స్ లోకి అఖిల్

Akhil akkineni movie to go on sets mid next month

akhil akkineni, bommarillu bhaskar, allu aravind, nagarjuna, Bunny Vaas, geetha arts 2, gopi sunder, rashmika mandana, movies, entertainment, tollywood

Akhil Akkineni next film with Bommarillu Bhaskar direction, produced by GA 2 banner belonging to Allu Aravind and Bunny Vaas. The romantic entertainer will be launched later this month.

రోమాంటిక్ లవ్ స్టోరీతో సెట్స్ లోకి అఖిల్

Posted: 05/08/2019 09:05 PM IST
Akhil akkineni movie to go on sets mid next month

అక్కినేని సినీవారసుడిగా చిత్ర రంగంలోకి అడుగ్గుపెట్టిన అక్కినేని అఖిల్ తన కెరీర్ బ్రేక్ కోసం ఇప్పటికీ వేచిచూస్తున్నాడు. అయితే ఓ వైపు గీతా అర్ట్స్ 2 బ్యానర్.. మరోవైపు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం.. ఈ రెండింటితో తన నాల్గొవ సినిమాతో హిట్ ఖాయమని అయన అభిమానులు మాత్రం అంచనాలు పెట్టేసుకున్నారు. దీంతో అఖిల్ నాల్గవ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని వారంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వారికి గుడ్ న్యూస్ ఇచ్చేస్తున్నాడు అఖిల్.

తన నాల్గవ చిత్రాన్ని వచ్చేనెల జూన్ రెండవ వారంలో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన పేరు వినిపిస్తోంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. బొమ్మరిల్లు భాస్కర్ అఖిల్ కు జంటగా సరిజోడైన మంచి నటిని ఎంచుకునే ప్రయత్నంలోనే వున్నారని టాక్.

ఎందుకంటే యంగ్ హీరోను గ్లామర్ తో పాటు హీరో ఎలిమెంట్స్ కూడా ఎలివేట్ అయ్యేలా చిత్ర కథను రూపోందించారట. ఇంతకీ చిత్ర కథ రోమాంటిక్ లవ్ స్టోరీ అన్న విషయం కూడా గుప్పమంటోంది. అందుకనే అఖిల్ సరసన ఇప్పటికింకా ఎవరినీ ఎంపిక చేయలేదట. త్వరలోనే హీరోయిన్ ఎవరనేది ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. లవ్ స్టోరీతో కూడిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి గోపీసుందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ చిత్రమైనా అఖిల్ ఆశలను నిలబెడుతుందా.? అన్నది వేచిచూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akhil akkineni  bommarillu bhaskar  allu aravind  gopi sunder  rashmika mandana  tollywood  

Other Articles