Vaishnav Tej's debut film has been titled 'uppena' ‘జాలరి’ పోయి ‘ఉప్పెన’ వచ్చే ఢాం..ఢాం..ఢాం

Official vaishnav tej debut movie title confirmed as uppena

Vijay Sethupati, uppena, Sukumar writings, Panja Vaishnav Tej, Mythri Movie Makers, Jalari, Sai Dharam Tej, Rural-centric films, Buchi Babu, Devi Sri Prasad, movies, entertainment, tollywood

Panja Vaishnav Tej's debut film was launched in February. It is said that this project will be titled as ‘Uppena', the film will be an out-and-out commercial mass entertainer, which is set in the rural backdrop.

‘జాలరి’ పోయి ‘ఉప్పెన’ వచ్చే ఢాం..ఢాం..ఢాం

Posted: 05/07/2019 07:19 PM IST
Official vaishnav tej debut movie title confirmed as uppena

మెగాస్టార్ చిరంజీవి చిన్న మేన‌ల్లుడు, డైనమిక్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి టైటిల్ మారింది. మత్స్యకారుడిగా పస్ట్ లుక్ ను విడుదల చేసిన క్రమంలో ఈ చిత్రానికి జాలరి అనే టైటిట్ బాగుంటుందని చిత్ర యూనిట్ భావించింది. ప్రముఖ ద‌ర్శకుడు సుకుమార్ వ‌ద్ద ద‌ర్శక‌త్వ శాఖలో అసిస్టెంట్‌గా ప‌నిచేసిన బుచ్చిబాబు ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు.

దర్శకుడికి కూడా ఇది తొలి చిత్రం కావడంతో సినిమా ఒక రేంజ్ లో వుంటుందన్న అంచానాలు అప్పుడే మెగా ఫ్యాన్స్ లో కలుగుతున్నాయి. దీనికి తోడు ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తాజాగా చిత్ర టైటిల్ ను ఖరారు చేస్తూ నిర్మాతలు ఒక ప్రకటనను విడుదల చేశారు. క‌థకు ఎలాంటి టైటిల్ పెట్టాల‌నే విషయంలో చాలా ఆలోచించామన్నారు.

చిత్రక‌థ‌కు త‌గిన విధంగా ‘ఉప్పెన‌’ టైటిల్ అయితే ప‌క్కాగా కుదురుతుందని దాన్నే ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, త‌మిళంలో వైవిధ్యమైన పాత్రల‌ను పోషించి త‌న‌కుంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న న‌టుడు విజయ్ సేతుప‌తి ఈ చిత్రంలో కీల‌క పాత్రలో న‌టిస్తున్నారు. ఈ నెలలోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభించ‌బోతున్నామని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. దీంతో వైష్ణవ్ తేజ్ చిత్రానికి ఉప్పెన టైటిల్ ఖరారుకావడంతో ’జాలరి‘ పోయి ‘ఉప్పెన’ వచ్చింది ఢాం.. ఢాం.. ఢాం అంటూ మెగా అభిమానులు నెట్టింట్లో షేర్ చేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Sethupati  uppena  Sukumar writings  Panja Vaishnav Tej  Mythri Movie Makers  tollywood  

Other Articles