Indian Group Dancing For A Pawan Kalyan Song Wins $1M అంతర్జాతీయ డాన్స్ వేదికపై పవన్ కల్యాణ్ పాట..

Indian group dancing for a pawan kalyan song wins 1m

jennifer lopez standing ovation, pawan kalyan song, sardar gabbar singh, mumbai team, ‘The Kings’, Derek Hough, Ne-Yo, tollywood, movies, entertainment

‘World of Dance’ is a famous American dance TV show, where Jennifer Lopez is one of the judges, along with Derek Hough and Ne-Yo. During the finale of the show, ‘The Kings’, A 14 member team not just impressed the judges but also blew their minds, and got a standing ovation for pawan kalyan song.

పవన్ కల్యాణ్ పాటకు.. జెన్నిఫర్ లోపెజ్ స్టాండింగ్ ఓవేషన్..

Posted: 05/07/2019 05:37 PM IST
Indian group dancing for a pawan kalyan song wins 1m

పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలోని పాటను అంతర్జాతీయ డాన్స్ షోలో ప్రదర్శించి అక్కడి న్యాయనిర్ణేతల నుంచి జయజయధ్వానాలు అందుకున్నారు. అందులోనూ అంతర్జాతీయ డ్యాన్సింగ్ సెన్సేషన్, సింగర్, హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ ను సైతం ముగ్ధురాలిని చేసి.. అమె నుంచి స్టాండింగ్ ఓవెషన్ అందుకున్నారు. అంతేకాదు ఏకంగా మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని కూడా సొంతం చేసుకున్నారు.

గతంతో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబ‌ర్ 150లోని సుంద‌రి అనే పాటకు ఓ భార‌త డ్యాన్స్ గ్రూప్ అప్ప‌ట్లో పాపుల‌ర్ అమెరిక‌న్ షోలో డ్యాన్స్ చేసింది. ఇప్పుడు చిరు సోద‌రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్‌లోని వాడెవ‌డన్నా వీడ‌వెడ‌న్నా అనే పాటను అంత‌ర్జాతీయ వేదిక‌పై ‘ది కింగ్స్‌’ అనే భార‌త డ్యాన్స్ గ్రూప్ స్టెప్పులు వేసి అల‌రించింది. ఈ షోలో భారత్ నుంచి ముంబయి కుర్రాళ్లతో కూడిన 'ద కింగ్స్' అనే గ్రూప్.. ఫినాలే షో సందర్భంగా 'వాడెవడన్నా వీడెవడన్నా సర్దార్ అన్నకు అడ్డెవరన్నా' అనే పాటకు '300' సినిమా కాన్సెప్ట్ ను మిక్స్ చేసి అదిరిపోయే రీతిలో పెర్ఫామ్ చేసింది.

స్టేజ్ డ్యాన్స్ అయినా ఆ పాటలో 'ద కింగ్స్' బృందం ప్రదర్శించిన థ్రిల్స్, నాట్య విన్యాసాలు చూసి జెన్నిఫర్ లోపెజ్ ఉద్వేగం పట్టలేకపోయారు. తన సీట్లోంచి పైకి లేచి మరీ 'ద కింగ్స్' ప్రదర్శన పట్ల కరతాళ ధ్వనులతో అభినందించారు. ఈ ఆనందాన్ని దేవి శ్రీ ప్ర‌సాద్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా నెటిజన్స్‌తో షేర్ చేసుకున్నాడు. త‌న సంగీత సార‌థ్యంలో రూపొందిన రెండు సాంగ్స్‌కి అంత‌ర్జాతీయ షోలో ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డం థ్రిల్లింగ్‌గా ఉంద‌ని పేర్కొన్నారు. ధన్యవాదాలు.. లవ్‌ యు గాయ్స్‌. మీరు ఎంతో చక్కగా డ్యాన్స్‌ చేశారు. కీప్‌ ‘రా‘కింగ్‌’స్‌’ అని ట్వీట్‌లో తెలిపారు డీఎస్పీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles