actress sridevi produced a movie with chiranjeei as hero చిరంజీవి హీరోగా సినిమా నిర్మించాలనుకున్న శ్రీదేవి

Actress sridevi produced a movie with chiranjeei as hero

yandamuri veerendranath, chiranjeevi, sridevi, producer, Jagadeka Veerudu Atiloka Sundari, entertainment, movies, tollywood

Bollywood yesteryears heroine and late actress sridevi had produced a movie which has not been concluded and been stoped in middle after the same ombination came out with hit movie Jagadeka Veerudu Atiloka Sundari recollected by yandamuri veerendranath.

చిరంజీవి హీరోగా సినిమా నిర్మించాలనుకున్న శ్రీదేవి

Posted: 04/26/2019 10:25 PM IST
Actress sridevi produced a movie with chiranjeei as hero

దక్షిణాది నుంచి బాలీవుడ్ కు వెళ్లిన అక్కడ కూడా తన సత్తా చాటుకుని టాప్ నటిగా కొన్ని దశాబ్దాల పాటు నిలిచిన నటి ఎవరంటే ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చేంది శ్రీదేవి మాత్రమే. అయితే అమె మన మెగాస్టార్ తో కలసి ఓ చిత్రాన్ని నిర్మించి నటించాలని కూడా భావించారట. ఏంటీ అయితే ఈ చిత్రం పట్టాలెక్కలేదా.? అని డౌటా..? డౌటేమీ లేదు. ఈ చిత్రం పట్టాలేక్కింది కానీ మధ్యలో అగింది. ఔనా.? ఎందుకు నిధుల లేమా.? అంటే కాదట. కేవలం కథ సరిగ్గా కుదరలేదని అగిందట. దీనికి దర్శకుడిగా ఏ కోదండరామిరెడ్డి వ్యవహరించారట.  

ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు రూపోందించిన జగదేకవీరుడు-అతిలోకసుందరి చిత్రం వచ్చిందని అది అప్పట్లో టాలీవుడ్ లోనే పెద్ద ఘనవిజయంగా నిలిచిందని అంటున్నారు నవలా రచయితగా యండమూరి వీరేంద్రనాథ్. ఆయన రాసిన ఎన్నో నవలలు సినిమాలుగా తెరకెక్కి, ఘన విజయాలను అందుకున్నాయి. తాజా ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు. " శ్రీదేవిగారి సినిమాలైన 'ఆఖరిపోరాటం' .. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' .. 'ఒక రాధ.. ఇద్దరు కృష్ణులు' సినిమాలకి పనిచేశాను.

శ్రీదేవి గారు చిరంజీవి హీరోగా ఒక సినిమా తీయాలనుకున్నారు. కోదండరామిరెడ్డి దర్శకుడు. ఆ సినిమాలో ఆవిడే హీరోయిన్. ఆ సినిమాకి వర్క్ చేస్తూ నేను ఆమె గెస్టు హౌస్ లో ఉండేవాడిని. ఆ సినిమాకి సంగీత దర్శకుడిగా బప్పీలహరిని తీసుకున్నారు. ఒక సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తయింది. ఆ తరువాత కథ ఫైనలైజ్ కాకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. ఆ తరువాతనే 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమా వచ్చింది. ఒకటి రెండు సార్లు ఆమెతో మాట్లాడటమే గానీ, అంతకి మించిన పరిచయం లేదు" అని చెప్పుకొచ్చారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles