Big B special gift to Charan రాంచరణ్ కు బిగ్ బి అమితాబ్ బచ్చన్ సర్ ప్రైజ్ గిప్ట్.!

Amitabh bachchans special gift for ram charan birthday

Ram Charan, Amitabh Bachchan, Ram charan Birthday, mega powerstar Ram charan, Amitabh bachchan gift to Ram charan, happy birthday ram charan, Big B wishes to Ram charan, Upasana konidela, movies, entertainment, tollywood

Ram Charan is celebrating his birthday today and this date is being celebrated all over. Wishes are pouring in from all over but one such wish which has made the day for Charan is from none other than Amitabh Bachchan.

రాంచరణ్ కు బిగ్ బి అమితాబ్ బచ్చన్ సర్ ప్రైజ్ గిప్ట్.!

Posted: 03/27/2019 01:04 PM IST
Amitabh bachchans special gift for ram charan birthday

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కు బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ నుంచి సర్ ప్రైజ్ గిప్ట్ అందింది. మాకు తెలుసు ఇవాళ మెగాపవర్ స్టార్ రాంచరణ్ జన్మదినం కాబట్టి అయనకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ గిప్ట్ అందించారు అంటారా.. అయితే మీరే కరెక్టు. అమితాబ్ అందించిన గిప్ట్ ఏంటంటే రాంచరణ్ కోసం ఆయన పుట్టిన రోజున ఓ వీడియో సందేశాన్ని పంపించడం. అంతేకాదు ఆయన తెలుగులో రాం చరణ్ కు శుభాకాంక్షలు తెలపడం కూడా వినూత్నమే.

ఇక బిగ్ బి నుంచి రాంచరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని వచ్చిన వీడియో మెసేజ్ ను చూసిన ఆయన సతీమణి ఉపాసన కొణిదెల సంతోషంలో మునిగితేలుతున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ తనయుడికి బాలీవుడ్ మెగస్టార్ బర్త్ డే విషస్ అందునా తెలుగులో పంపించడాన్ని అమె నమ్మలేకపోతున్నారు. ఇప్పటికీ తన చేతులు సంతోషంలో వణుకుతున్నాయంటూ అమె ట్వీట్ చూసిన అమె తన భావోద్వేగాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో అమితాబ్ మాట్లాడుతూ..

‘హలో చరణ్.. నేను అమితాబ్. మార్చి 27 నీ పుట్టినరోజు. ఈ రోజు నుంచి నీకు అంతా మంచే జరగాలని నేను, నా కుటుంబం కోరుకుంటున్నాం. నువ్వొక అద్భుతమైన వ్యక్తివి. నీ వయసెంతో నాకు తెలీదు. కానీ, నేను నిన్నెప్పుడు చూసినా 18 ఏళ్ల కుర్రాడిగానే కనిపిస్తుంటావ్. నువ్వెప్పటికీ ఇలానే ఉండాలి. నీ మాతృ భాషలో నేను ఇప్పుడు విష్ చేస్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు చరణ్. ఆల్ ది వెరీ బెస్ట్’ అని అన్నారు.

ఈ వీడియోను ఉపాసన ట్వీట్ చేస్తూ అమితాబ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇదొక మధురమైన బహుమతిగా మిగిలిపోతుందన్నారు. ‘నా చేతులు ఇప్పటికీ వణుకుతూనే ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది’ అని తన ట్వీట్‌లో ఉపాసన పేర్కొన్నారు. కాగా, రామ్ చరణ్ నిర్మిస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో అమితాబ్ ముఖ్య పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి అమితాబ్ కుటుంబంతో చిరంజీవి ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే అమితాబ్ నేడు చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Amitabh Bachchan  social media  Upasana konidela  tollywood  

Other Articles