Lakshmi's Veera Grandham Movie Official Trailer లక్ష్మీస్ వీరగ్రంధం టీజర్ విడుదల

Lakshmi s veera grandham movie official trailer

Lakshmi's Veera Grandham, Lakshmi Parwati, Sri Reddy, Kethireddy Jagadheesh Reddy, Sri Reddy, tollywood, movies, entertainment

Official trailer of the film Lakshmi's Veera Grandham released today. Senior Telugu movie producer Kethireddy Jagadishwara Reddy is the film director and the story of this film is related to the life of former CM N T Rama Rao and Lakshmi Parvathi.

లక్ష్మీస్ వీరగ్రంధం టీజర్ విడుదల

Posted: 03/13/2019 08:48 PM IST
Lakshmi s veera grandham movie official trailer

ఎన్నికలవేళ దివంగత ఎన్‌టీఆర్ మీద సినిమాలు చేస్తూ ఎవరికి అనుకూలంగా వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో లక్ష్మీస్ ఎన్‌టీఆర్ సినిమా విడుదలకు సిద్ధం అవగా.. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం అనే సినిమాను తీస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ల‌క్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఇంటి గ‌డ‌ప తొక్కుతుండగా.. గద్ద పైనుండి వెళ్లడం.. ఆ స‌మ‌యంలో తెలుగింటి గ‌డ‌ప‌పై విర‌జిమ్మిన 'విష‌ం' అనే క్యాప్ష‌న్ రాశారు. ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీ పార్వ‌తి వ‌చ్చిన త‌ర్వాత ఏం జ‌రిగింది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది.

టీజర్ విడుదల సంధర్భంగా.. ఎన్‌టీఆర్ జీవితంలో జరిగిన అత్యంత కీలకమైన ఘటలను చిత్రీకరిస్తున్నామని కేతి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ తుది దశలో ఎదుర్కొన్న అత్యంత అవమానకరమైన, కీలకమైన సన్నివేశాలను సినిమాగా తీస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమా ఎవరినీ ఉదేశించి తీయట్లేదని, ఏప్రిల్ తొలి వారంలో సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు.

నాగరుషి ఫిలిమ్స్ సమర్పణలో, జయం మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో ల‌క్ష్మీ పార్వ‌తిగా శ్రీ రెడ్డి న‌టిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌లో ల‌క్ష్మీ పార్వ‌తికి సంబంధించిన పాజిటివ్ అంశాల‌ని వ‌ర్మ చూపించే ప్రయత్నం చేస్తుండగా, ఈ సినిమాలో నెగెటివ్ అంశాల‌ని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చూపించ‌నున్నట్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles