Muslim Youth Oppose #SyeRaa Shooting చిరంజీవి ‘సైరా’ షూటింగ్ కు మళ్లీ బ్రేక్..

Sye raa narasimha reddy shooting stalled in bidar

syeraa narasimha reddy, chiranjeevi, freedom fighter, muslim youth, bahamani kota, bidar, karnataka, Ram charan, surender Reddy, movies, entertainment, tollywood

The shooting of the film ‘Sye Raa Narasimha Reddy’ was blocked by Muslim Youth in the town of Bidar. A tense atmosphere was created around the location with the Muslim Youth fiercely opposing the use of Hindu idols in the Muslim praying area in the Bahmani Sultan Castle.

చిరంజీవి ‘సైరా’ షూటింగ్ కు మళ్లీ బ్రేక్..

Posted: 02/25/2019 04:45 PM IST
Sye raa narasimha reddy shooting stalled in bidar

తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ సారాంశంగా రూపోందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ కు మరోమారు ఆటంకం కలిగింది. గతంలో రంగస్థలం చిత్ర సినిమా లోకేషన్లో ‘సైరా’ షూటింగ్ జరుపుతుండగా శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. కాగా, తాజాగా ఈ చిత్ర షూటింగ్ ను ఇవాళ కొంతమంది యువకులు బీదర్ అడ్డుకున్నారు.

ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు కర్ణాటకలోని బీదర్ లో ఉన్న బహమని కోటలో యూనిట్‌ సర్వం సిద్ధం చేసుకుంది. చిత్రీకరణలో భాగం కోటలో హిందూ దేవతల విగ్రహాలను ఏర్పాటు చేశారు. అధికారుల నుంచి అనుమతి తీసుకుని చిత్రీకరణ ప్రారంభించారు. అయితే స్థానిక ముస్లిం యువకులు షూటింగ్‌కు సోమవారం అంతరాయం కల్గించారు. ముస్లిం కోటలో హిందూ దేవతల్ని నెలకొల్పడం ఏంటని యూనిట్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ మేరకు వారు పోలీసుల్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు సెట్‌లోని దేవతల విగ్రహాల్ని తొలగించినట్లు చెబుతున్నారు.

చిరంజీవి ‘సైరా’ సినిమాలో కథానాయకుడి పాత్ర పోషిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌ చరణ్‌ సినిమాను నిర్మిస్తున్నారు. సాయిమాధవ్‌ బుర్ర మాటలు రాస్తున్నారు. అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్నారు. సుదీప్‌, అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, విజయ్‌ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులోని అతిథి పాత్రలో అల్లు అర్జున్‌ కనిపించనున్నట్లు తెలిసింది. ఈ ఏడాదిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles