Rashmika Mandanna to make her Tamil debut కాలీవుడ్ లోకి కాలుపెడుతున్న రష్మిక

Geetha govindam actress rashmika mandanna to make her tamil debut with karthi s next

rashmika mandanna, vijay deverakonda, Karthi, Geetha Govindam, rashmika mandanna Tamil debut, siruthai, dhilip subbarayan, maanagaram, publicity stunt, latest movie news, kollywood, movies, entertainment

Rashmika Mandanna, who rose to fame through sensational blockbuster Geetha Govindam, has signed her first film in Tamil. She will be paired opposite Karthi in a yet-untitled project produced by SR Prakash Babu and SR Prabhu of Dream Warrior Pictures.

వరుస సినిమాలతో గీతాగోవిందం బ్యూటీ బిజీ.!

Posted: 02/25/2019 12:46 PM IST
Geetha govindam actress rashmika mandanna to make her tamil debut with karthi s next

గీతా ఆర్ట్స్ 2 నుంచి వచ్చిన గీతా గోవిందం చిత్రం టాలీవుడ్ లో ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచమైన బామ రష్మిక మందన. విజయ్ దేవరకొండ అమాయాకత్వానికి.. రష్మిక అటిట్యూడ్ కి మధ్య చక్కని సన్నివేశాలతో చిత్రీకరించిన ఈ చిత్రం అటు వెండితెరతో పాటు ఇటు బుల్లితెరపై కూడా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రం బ్యూటీ చేతిలో రెండు మూడు తెలుగు సినిమాలు వున్నాయి.

ఈ సినిమాలు తన క్రేజ్ ను మరింతగా పెంచుతాయని ఆమె భావిస్తోన్న అమె.. ఇదే సమయంలో అటు తమిళంలోను తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆసక్తిని చూపుతోంది. దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్ని పెద్దల సూక్తులు ఫోలో అవుతున్నట్లు వుంది. అందుకనే ఆలస్యం చేయకుండా తమిళంలో ఎంట్రీకి రెడ్డీ అయ్యింది. అవకాశాలు వచ్చినప్పడే అందుకోవాలి కానీ మనకు కావాల్సినప్పుడు మాత్రం అవి రావన్న సత్యాన్ని గ్రహించినట్టున్న రష్మిక.. హీరో కార్తీ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

'దేవ్' ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో, ఆ వెంటనే తన తదుపరి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి కార్తీ రెడీ అవుతున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, మార్చి 2వ వారంలో సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో ఈ దర్శకుడు తెరకెక్కించిన 'రెమో' భారీ విజయాన్ని సాధించడం వలన, ఈ ప్రాజెక్టుపై అంచనాలు వున్నాయి. ఈ సినిమా హిట్ అయితే తమిళంలోను రష్మిక బిజీ అవుతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rashmika mandanna  Karthi  Tamil debut  Geetha Govindam  siruthai  dhilip subbarayan  kollywood  

Other Articles