Naga Babu targets Chandrababu, Lokesh నాగబాబు ‘బాలానంద స్వామి’ స్కిట్లో ఆ స్టార్స్..

Naga babu targets chandrababu in his jabardasth skit style

pawan kalyan, janasena, Pawan Kalyan Naga Babu, my channel naa ishtam, rising raju, dora babu, nagababu skit, Naga Babu, Nara lokesh, Jabardasth, Chandrababu, Balakrishna, a political viva, andhra pradesh, politics

Mega Brother, Actor Nagababu who became more popular as Judge in Jabardasth comedy, targets Andhra Pradesh CM Chandra Babu, and Minister Nara Lokesh in his skit style.

నాగబాబు ‘బాలానంద స్వామి’ స్కిట్లో ఆ స్టార్స్..

Posted: 02/20/2019 09:19 PM IST
Naga babu targets chandrababu in his jabardasth skit style

ప్రముఖ తెలుగు నటుడు నాగబాబు మరోసారి తన యూట్యూబ్ చానల్.. ‘మై ఛానెల్ నా ఇష్టం’ ద్వారా కొంత మందిని  టార్గెట్ చేస్తూ  మరో స్కిట్‌ని  వదిలారు. మెగా బ్రదర్ గా గుర్తింపు సాధించిన నాగబాబుకు ఇటీవలి కాలంలో జబర్దస్త్ కామెడీ షో.. ఆయనకు మరింతగా పాపులారిటీ సంపాదించి పెట్టింది. ఇక ఆయన తనతో పాటు ఇద్దరు జబర్దస్త్ కమెడియన్స్‌ ను తన మై ఛానెల్ నా ఇష్టం స్కిట్ లోకి తీసుకువచ్చారు. రైజింగ్ రాజు, దొరబాబులతో స్కిట్‌లు వేయించి మరీ అధికార ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పెట్టే హాస్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఆయన ఆ వీడియోలో ‘బ్యాంకాక్ లో జరిగిన యథార్థ సంఘటన’ అంటూ  తన స్కిట్ ను పోస్ట్ చేశారు. ‘బాలానంద మహరాజ్ కి జై..’ అంటూ మొదలయ్యే.. ఆ స్కిట్‌లో ఓ స్వామిజీతో, ఇద్దరు శిష్యుల పాత్రలు ఉన్నాయి. ఆ స్కిట్ ప్రకారం.. స్వామిజీని తన ఇద్దరు శిష్యులు ప్రశ్నించడం ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకుంటారు. ఈ స్కిట్ ద్వారా అయన అధికార, ప్రతిపక్ష పార్టీలను తనదైనశైలిలో టార్గెట్ చేశారు. ఇక ఓటుకు నోటు కేసులోని అడియో క్లిప్ ను కూడా ఆయన ఈ స్కిట్ లో వినియోగించుకున్నారు.

ఈ స్కిట్ లో స్వామి బయోపిక్ అంటే ఏంటి స్వామి అని రైజింగ్ రాజు, దొరబాబులు భక్తుల అవతారంలో స్వామిని అండుగుతుంటే.. స్వామిగా ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ బాలానంద ‘ ఎలక్షన్స్ కోసం చేసే కిక్‌నే బయోపిక్ అంటారు నాయనా’ అని.. ఎర్రిపప్పలు అని ఎవర్ని అంటారు స్వామి అంటే.. ‘ఇంకా ఆయన అభివృద్ధి చేస్తారని నమ్మేవాళ్లని ఎర్రిపప్పులు అంటారు నాయనా’.. అంటూ బాలా నంద స్వామి పంచ్ లు వేస్తున్నారు.

అంతేకాదు.. ‘పప్పు అంటే ఎవరు స్వామి అంటే.. తను ఒకటి మాట్లాడాలనుకుంటే దేవుడు ఆయనతో ఇంకోటి మాట్లాడిస్తాడు తననే పప్పు అంటారు నాయనా’ అని ఇన్ డైరెక్ట్‌గా లోకేష్ బాబుకి పంచ్ వేశారు. వీటితో పాటు.. పోలవరం ప్రాజెక్ట్ పైన పంచ్ పేల్చారు. పథకాలను ఐదు సంత్సరాలను నుండి అమలు చేస్తే దాన్ని అభివృద్ధి అంటారు.. ఎన్నికలకు ఐదు నెలల ముందు చేస్తే అమలు చేస్తే.. ఆందోళన అంటారు. జనాల్ని సపోర్ట్ చేసేవాడ్ని జర్నలిస్ట్ అంటారు. కులాన్ని సపోర్ట్ చేసే వాడిని శాడిస్ట్ అంటారు. బ్రీఫ్డ్ మీ.. ఈ వాయిస్ నాది కాదు ఎవరో మిమిక్రీ చేశారు’ లాంటి డైలాగ్స్‌తో చంద్రబాబు, లోకేష్ బాబులని టార్గెట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Naga Babu  political viva  rising raju  dora babu  andhra pradesh  politics  

Other Articles

Today on Telugu Wishesh