7 movie official trailer released 7 మూవీ ట్రైయిలర్.. ‘‘ఐ విల్ గెట్ యు’’

7 movie official trailer ft havish nandita swetha regina

7 movie official trailer, 7 movie trailer, Havish, Nandita Swetha, Rahman, Regina Cassandra, Nizar Shafi, Ramesh Varma, Chaitan Bharadwaj, Aditi Arya, Anisha Ambrose, Pujitha Ponnada, Tridha Choudhury, publicity stunt, latest movie news, kollywood, movies, entertainment

The official trailer of crime thriller 7 movie has been released in which Havish, Nandita Swetha, Rahman and Regina Cassandra are playing lead roles.

7 మూవీ ట్రైయిలర్.. ‘‘ఐ విల్ గెట్ యు’’

Posted: 02/07/2019 06:22 PM IST
7 movie official trailer ft havish nandita swetha regina

అటు బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెళ్లి.. స్వలింగసంపర్కురాలిగా నటించిన రెజీనా.. ఇటు తెలుగులోనూ నటించిన 7 సినిమా కూడా త్వరలో విడుదల కానుంది. అయితే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలోనూ రెజినీ కొంత భిన్నమైన గ్లామర్ పాత్రలోనే నటించిందని సమాచారం. ఈ చిత్రంలో హవీష్, నందితా శ్వేత, రహమాన్ తదితరులు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన మూవీ ట్రైయిలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘‘ఒక్కడున్నాడు.. వున్నడో లేదో తెలియదు.. వున్నాడనే అంటున్నారు.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు కాదు.. ఇంకా ఎంత మంది.. అందరినీ ముడి వేసిన ప్రశ్న వాడు.. సమాధానం వాడు.. ఎవడు వాడు.. ఎక్కడుంటాడు.. ఏం చేస్తుంటాడు.. యు మే రన్.. ఐ విల్ గెట్ యు’’ అంటూ బేస్ వాయిస్ లో పోలీసు అధికారి చెప్పడంతో ఇది సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థమవుతుంది.

పలు తెలుగు చిత్రాలకు సినిమాటోగ్రఫర్ గా పనిచేసిన నిజార్ షఫీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఈ చిత్రంతో దర్శకుడిగా కూడా మారబోతున్నారు. ఈ చిత్రాన్ని రమేష్ వర్మ నిర్మిస్తున్నారు. ఇక యువతను అకర్షించిన ఆర్ఎక్స్ 100 చిత్ర సంగీత దర్శకుడు చైతన్ భరధ్వాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఇక అతిధి అర్య, అనిషా అంబ్రోస్, పూజితా పొన్నాడ, త్రిధ చౌదరి తదితరులు కూడా నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 7 movie trailer  Havish  Nandita Swetha  Rahman  Regina Cassandra  Nizar Shafi  tollywood  

Other Articles