Vijay Devarakonda in Forbes India Under 30 ధర్టీ అండర్ ధర్టీ జాబితాలో విజయ్ దేవరకొండ

Vijay deverakonda listed in forbes 30 under 30

Vijay Devarakonda, Vijay Devarakonda news, Vijay Devarakonda updates, Vijay Devarakonda in Forbes, Forbes India 30 Under 30, Vijay Devarakonda latest updates, Vijay Devarakonda new films, Vijay Devarakonda next movie, Vijay Devarakonda new movie, movies, entertainment, tollywood

Vijay Devarakonda joined the list of Forbes India 30 Under 30 and is the only actor to make it into the list.

ఫోర్బ్ ఇండియా ధర్టీ అండర్ ధర్టీ జాబితాలో విజయ్ దేవరకొండ

Posted: 02/04/2019 09:02 PM IST
Vijay deverakonda listed in forbes 30 under 30

చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ ప్లే చేసి.. పెళ్లి చూపులు చిత్రంతో తెలుగుతెరకు హీరోగా పరిచయం అయిన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చాడు. ఇదివరకు నాచురల్‌గా నటించే వాళ్లలో నాని మొదటి ప్లేస్‌లో నిలిచేవాడు. ఆ స్థానాన్ని విజయ్ దేవరకొండ కొట్టేశాడు. అలవోకగా ఎటువంటి సీన్లనైనా పండించ‌డం విజయ దేవరకొండకు కొట్టిన పిండి. అదే ఇప్పుడు విజయ్ ను స్టార్ హీరోగా చేసింది.

రెండు మూడు సినిమాలకే స్టార్ హీరోకు వచ్చినంత స్టార్ డమ్ వచ్చింది. అర్జున్ రెడ్డి చిత్రం ఆయన చిత్రసీమలో నిలబెట్టిన తరువాత.. గీతా అర్ట్స్ బ్యానర్ లో వచ్చిన గీతా గోవిందం చిత్రం ఆయనను ఒక్కసారిగా రేంజ్ మారిపోయేలా చేసింది. తాజాగా విజయ్.. ఫోర్బ్స్ 30 అండర్ 30లో చోటు సంపాదించుకున్నాడు. ఇటీవలే ఫోర్బ్స్ ఇండియా తన ఆరో ఎడిషన్ ను ప్రకటించింది. భారత్ కు చెందిన 30 ఏళ్లలోపు వయసు ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రొఫెషనల్స్‌ను ఫోర్బ్స్ ఎంపిక చేసింది.

కాగా ఈ జాబితాలో విజయ్ దేవరకొండ(29) చోటు సంపాదించాడు. ఎంటర్ టైన్మెంట్ అండ్ మ్యూజిక్ కేటగిరీలో విజయ్‌ని ఎంపిక చేశారు. అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్‌బస్టర్‌తో విజయ్ దేవరకొండ తెలుగు సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడని ఫోర్బ్స్ ఇండియా తెలిపింది. విజయ్ సినిమా కెరీర్‌కు అర్జున్ రెడ్డి ఓ మలుపు అని అభివర్ణించింది. విజయ్ మొదటి సారిగా నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా 2019 లో రిలీజ్ అవనున్నట్టు ఫోర్బ్స్ తెలిపింది. ఈ కేటగిరీలో విజయ్‌తో పాటు యూట్యూబర్ ప్రజక్తా కొలి(25), సింగర్ మేఘనా మిశ్రా(17)ను ఫోర్బ్స్ ఎంపిక చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Devarakonda  forbes  under 30 list  tollywood  

Other Articles