'I truly embrace all my scars': Tahira Kashyap క్యాన్సర్ పై భావోద్వేగంతో నటి సతీమణి పోస్ట్..

Tahira kashyap bares her scars in powerful pic on world cancer day

Ayushmann Khurrana, Tahira Kashyap, World Cancer Day, Tahira Kashyap Photo, Tahira Kashyap Cancer Scar, publicity stunt, latest movie news, kollywood, movies, entertainment

Actor Ayushmann Khurrana’s wife and filmmaker Tahira Kashyap has shared a powerful new picture on World Cancer Day. In the picture, she shows her bald head, bare back and a scar from her mastectomy.

క్యాన్సర్ పై భావోద్వేగంతో నటి సతీమణి పోస్ట్..

Posted: 02/04/2019 07:12 PM IST
Tahira kashyap bares her scars in powerful pic on world cancer day

అంధాధున్, బదాయి హోలాంటి సూపర్‌హిట్ బాలీవుడ్ మూవీస్‌తో స్టార్ హీరోగా మారిన ఆయుష్మాన్ ఖురానా భార్య తాహిరా కశ్యప్ కూడా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నది. ఇప్పటికే ఆమె క్యాన్సర్ చికిత్స కూడా తీసుకుంటోంది. అయితే సోమవారం వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆమె ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఓ భావోద్వేగ సందేశం క్యాన్సర్ బాధితుల్లో నైతిక స్థైర్యాన్ని నూరిపోసేలా ఉంది.

ఇవాళ నా రోజు. అందరికీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ రోజును ఘనంగా జరుపుకోవాలి. ఈ వ్యాధిపై ఉన్న అపోహను మనం ముందు తొలగించుకోవాలి. అందుకే ఈ ఫొటోను పోస్ట్ చేస్తున్నాను. నా ఒంటిపై ఉన్న ఈ క‌త్తిగాట్లు ఓ గౌర‌వ చిహ్నంగా భావిస్తున్నాను. నేను రోగాన్ని కాకుండా దానిని ధైర్యంగా ఎదుర్కొన్న తీరును చెప్పడానికి ఈ ఫొటోను పోస్ట్ చేశాను అని తాహిరా ఓ సందేశాన్ని ట్వీట్ చేసింది. ఆమె ఈ మధ్యే లాక్మె ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ కూడా చేయడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles