తెలంగాణ యాసలో తనదైన శైలిలో టీవీ చానళ్లలో, సినిమాల్లో పాప్యులర్ అయిన బిత్తిరి సత్తిలో తన యాసతో పాటు తన సైటర్లను కూడా బిత్తిరిగానే ప్రదర్శిస్తూ.. బిత్తిరి సత్తి అంటే ఠక్కున యావత్ తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టేలా ప్రత్యేకతను సంతరించుకున్నాడు. అయితే కేవలం టీవీ షోలు మాత్రమే కాకుండా.. అతనిలో మరో టాటెంట్ కూడా వుందండోయ్. అదేంటో మాకు తెలుసు.. సినిమాల్లో నటించే టాలెంటేగా.. అంటారా..
నటనే కాదు.. అతను హీరోగా తుపాకీ రాముడు అన్న చిత్రం కూడా రూపోందుతున్న విషయం తెలిసిందే. అతనిలో పాటలు పాడే టాలెంట్ కూడా ఉందండోయ్. తాజాగా జరిగిన 'దిక్సూచి' ఆడియో ఆవిష్కరణలో పాల్గొని, సినిమాలో తాను ఆలపించిన ఓ పాటను పాడిన బిత్తిరి సత్తి, ఆహూతులతో అదుర్స్ అనిపించాడు. పద్మనావ్ భరధ్వాజ్ రచించిన పాటకు రాచూరి నరసింహ రాజు స్వరకల్పన చేయగా, బిత్తిరి సత్తి పాడాడు.
"మట్టిలోన మట్టిరా దేహమన్నది... వీర్యము కణమై కడుపున పడుతూ, నెలనెల ఎదిగిన ఓ శిశువా... తనువే తొడిగి, భువిలో పడుతూ తెలియని పుట్టుక నీదికదా.. పూర్వజన్మాల స్మృతిని, మరిచిపోయావు మానవా... మాయనిన్నావరించి, నడక నేర్చావు మెల్లగా..." అంటూ సాగే పాటను సత్తి అద్భుత రీతిలో ఆలపించి, తనలో మరో నైపుణ్యం కూడా ఉందని నిరూపించాడు. బిత్తిరి సత్తి పాట పాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆలస్యమెందుకు మీరు వీక్షించండీ..
(And get your daily news straight to your inbox)
Mar 08 | ఫాన్ ఇండియా నటుడు రానా దగ్గుబాటి అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని తనదైన సినిమా స్టైల్లో మహిళాలోకానికి శుభాకాంక్షలు తెలిపాడు. తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టును పెట్టి.. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి... Read more
Mar 08 | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న 'వకీల్ సాబ్' సినిమా నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ పోస్టర్ విడుదలైంది. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో ఉన్న ఈ... Read more
Mar 04 | పర్సంటేజ్ తక్కువొచ్చిందని ఎవరైనా చదువు మానేస్తారా? మన జాతి రత్నం శ్రీకాంత్ అలియాస్ నవీన్ పొలిశెట్టి మాత్రం బీటెక్‌లో 40 శాతమే వచ్చిందిని ఎమ్‌టెక్ చేయకుండా ఉండిపోయాడట. అది నిజంగా కాదులెండి జాతిరత్నాలు సినిమాలో.... Read more
Mar 04 | రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను... Read more
Mar 04 | ఎంత దూరమైనా డ్రైవింగ్ చేసేందుకు రెడీ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే మాత్రం మావల్ల కాదంటుంటారు చాలామంది వాహనదారులు. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా? ఎప్పుడు సర్రుమంటూ స్పీడుతో ముందుకు దూసుకెళ్దామా? అని... Read more