NTR Becomes Alive in Lakshmi’s NTR ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఫస్ట్ లుక్: అచ్చు గుద్దినట్టు..

Ntr first look in ramgopal varma s lakshmi s ntr

NTR Becomes Alive, Lakshmi’s NTR, NTR First Look, Ram Gopal Varma, Kalyani Malik, Rakesh Reddy, GV Films, SriKrishna, SiraSri, Vennupotu, movies, entertainment, tollywood

NTR Becomes Alive in Lakshmi’s NTR. Presenting NTR First Look from #LakshmisNTR Directed by Ram Gopal Varma. Music by Kalyani Malik.

అర్జీవి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఫస్ట్ లుక్: అచ్చు గుద్దినట్టు..

Posted: 01/18/2019 08:36 PM IST
Ntr first look in ramgopal varma s lakshmi s ntr

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి ఇందులో ఎన్టీఆర్ పాత్ర పోషించిన నటుడి లుక్ ఎలా వుంటుందన్న ఉత్కంఠకు ఇవాళ తెరదించాడు దర్శకుడు. ఎన్టీఆర్ పాత్రను విడుదల చేసి ఒక్కసారిగా లక్ష్మిస్ ఎన్టీఆర్ క్లిక్ అయ్యేలా చేశాడు. ఎన్టీఆర్ వర్థంతి సందర్బంగా నందమూరి ఫ్యామిలీ ఫొటోలతో ఎంతో హంగామా చేయగా ఇప్పుడు వర్మ ఏకంగా వీడియో వదిలి ఇతనే ఎన్టీఆర్ అని చెప్పాడు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఇదివరకే లక్ష్మి పార్వతికి సంబందించిన పాత్రను అలాగే చంద్రబాబు పాత్రను రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అవి వైరల్ అయ్యే లోపే ఇప్పుడు సరికొత్త వీడియోతో ఆర్జీవీ మరో టాపిక్ కు శ్రీకారం చుట్టాడు. అయితే ఎన్టీఆర్ లుక్ మాత్రం అదిరిందన్నది టాక్. కథానాయకుడులోని పలు సన్నివేశాల్లో హీరో బాలకృష్ణ కూడా మెరవని విధంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర అచ్చుగుద్దినట్టుగా వుందని వార్తలందుతున్నాయి.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ చివరి దశలో లక్ష్మి పార్వతి ప్రవేశించిన అనంతరం ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి అనే అంశాలను వర్మ చూపించనున్నాడు. అయితే  65+ వయసులో ఉన్న ఎన్టీఆర్ ని వర్మ తన సినిమా కోసం సెట్ చేసుకున్నాడు. ఇక ఆ లుక్ లో కనిపిస్తోన్న వ్యక్తి అయితే అంతగా సెట్టవ్వలేదని టాక్ వస్తోంది. మరి సినిమాలో ఆ లుక్ ఏ విధంగా ఉంటుందన్నది వేచి చూడాల్సిందే..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh