Adrushyam Movie Teaser launched అదృశ్యం టీజర్ లాంచ్.. వారితోనే హాస్యం..

Adrushyam movie teaser launched

Adrushyam, Movie Teaser, Jaan, Anganarai, Kalpana, Jabardasth RP, Vinod, Ravi Prakash, director Ravi Prakash, music aldrin, tollywood, movies, entertainment

Tollywood director Ravi prakash, who turned as producer with a Horror-comedy movie Adrushyam had launched his movie teaser.

అదృశ్యం టీజర్ లాంచ్.. వారితోనే హాస్యం..

Posted: 01/17/2019 04:24 PM IST
Adrushyam movie teaser launched

హారర్, కామెడీ, థ్రిల్లర్‌ ప్రధానాంశాలుగా రూపొందిన చిత్రం ‘అదృశ్యం’. జాన్‌ హీరోగా, ప్రియాంక, హర్షద, తేజారెడ్డి, జయవాణి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇవాళ చిత్ర నిర్మాణ యూనిట్ విడుదల చేసింది. రవిప్రకాష్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ అయింది.

ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ వద్ద తన కెరీర్ ప్రారంభమైందని, ఆ తరువాత సింగీతం శ్రీనివాస్‌ వద్ద 14 సినిమాలకు పని చేశానని.. ఈ గోప్ప దర్శకుల వద్ద పనిచేయడం తనకు లభించిన అదృష్టంగా చెప్పిన దర్శక నిర్మాత రవిప్రకాష్.. తాను రూపొందించిన ‘బంటీ ది బ్యాడ్‌బాయ్‌’కు ఎన్నో అవార్డులు వచ్చాయని కూడా గుర్తు చేసుకున్నారు.

‘అదృశ్యం’ ఒక హారర్, కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పుకోచ్చిన ఆయన చిత్రంలోని తెరముందు, తెర వెనుకనున్న సభ్యులందరి సహకారంతో సినిమా బాగా వచ్చింది’’ అన్నారు. అనంతరం చిత్ర హీరో జాన్ మాట్లాడుతూ ఇది తన 3వ సినిమా అని, ఈ చిత్రాన్ని కూడా అందరూ అదరిస్తారని ఆవిస్తున్నానని అన్నారు. ఇక తనకు గోప్ప దర్శకుడు కే.విశ్వనాథ్‌ నుంచి లభించిన ప్రశంసతో ఉబ్బితబ్బిబవుతున్నారు హీరో జాన్. తాను ప్రభాస్‌లా ఉన్నానని ఆయన అన్నారని చెప్పుకోచ్చారు. కాగా, తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే బజర్థస్త్ టీంలోని పలువురు నటులకు ఈ చిత్రంలో అవకాశం లభించింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Adrushyam  Movie Teaser  Jaan  Anganarai  Kalpana  Jabardasth RP  Vinod  Ravi Prakash  tollywood  

Other Articles