mohan babu on ntr kathanayakudu movie ఎన్టీఆర్ కథానాయకుడిపై డైలాగ్ కింగ్ మాట..

Actor mohan babu on ntr kathanayakudu movie in twitter

ntr kathanayakudu, ntr biopic celebrities review, mohan babu on ntr kathanayakudu, ntr biopic, celebrities review, mohan babu, andhrula annagaru, tollywood, movies, entertainment

Actor Mohan Babu says, NT Rama Rao is my brother. It is not an easy task to make a biopic on such a human being and actor. On top of it, his son Balakrishna trying to recreate the characters his father played is not at all easy.

ఎన్టీఆర్ కథానాయకుడిపై డైలాగ్ కింగ్ మాట..

Posted: 01/09/2019 04:46 PM IST
Actor mohan babu on ntr kathanayakudu movie in twitter

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మూవీ భారీ అంచనాల నడుమ నేడు (జనవరి 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలోని కొన్ని సీన్స్ చూస్తుంటే.. మళ్ళీ అన్నయ్య పుట్టాడా అనేట్టు ఉందన్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

‘యన్. టి. రామారావు గారు.. నాకు అన్నయ్య. ఏక గర్భమునందు జన్మించకపోయినా మేమిద్దరం అన్నదమ్ములు అని చెప్పిన మహానుభావుడు. ఆయన బయోపిక్‌ని తెలుగులో తీయడమనేది మామూలు విషయం కాదు. అందులోనూ మహానటుడు కుమారుడు బాలయ్య అంటే తండ్రి చేసినటువంటి పాత్రలను తను పోషించడం అనేది కూడా మామూలు విషయం కాదు.

అదీ కొంచెం కష్టతరమైన పని. అయినా ఒక మంచి దర్శకుడి చేతిలో పడి, ఆ సినిమా నిర్మించబడి, తను యాక్ట్ చేశాడంటే.. ఇదొక అద్భుతం, అమోఘం. ఆడియో ఫంక్షన్‌కు నన్ను పిలిచారు.. నేను వెళ్ళాను కొన్ని క్లిప్పింగ్స్ చూస్తే మళ్ళీ అన్నయ్య పుట్టాడా అని అనిపించినట్టు కొన్ని కొన్ని సీన్స్ లో ఉన్నాయి. అంటే తన కుమారుడు బాలయ్య కొన్ని యాంగిల్స్‌లో తన తండ్రి పోలికలను ఉండడం అనేది కూడా ఒక అద్భుతం. ఈ పిక్చరు అత్యద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తుందని నమ్ముతూ ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను’ అంటూ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంపై స్పందనను తెలియజేశారు మోహన్ బాబు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Mahesh babu s sarileru neekevvaru release date confirmed

  మహేష్ ‘సరిలేరు నీకెవ్వరూ’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

  Oct 12 | అలా.. అలవైకుంఠపురములో మూవీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారో లేదో ఇలా సంక్రాంతి బరిలో కాస్కో అంటూ వచ్చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీ రిలీజ్ డేట్‌ను... Read more

 • Sye raa box office day 8 collection chiru s film mints rs 90 crore in telugu states

  తెలుగునాట రూ.90 కోట్ల షేర్ రాబట్టిన ‘సైరా’

  Oct 10 | మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా.. ఆయన నటించిన తొలి చారిత్రక చిత్రం తెలుగు రాష్ట్రాలలో సందడి చేస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాంచరణ్ నిర్మించిన 'సైరా నరసింహా రెడ్డి' చిత్రం ప్రేక్షకుల ముందుకు... Read more

 • Telangana governor tamilisai soundararajan praises this sye raa

  మెగాస్టార్ ‘సైరా’ను ప్రశంసించిన గవర్నర్ తమిళ సై..

  Oct 10 | మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన చారిత్రాక చిత్రం ‘సైరా’ విమర్శకులతో పాటు ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి నటనను అబాలగోపాలం కీర్తిస్తున్నారంటే.. ఆయన ఎంతగా ఈ చిత్రం కోసం... Read more

 • Gaddalakonda ganesh rs 21 crore share in two weeks

  గద్దలకొండ గణేష్ రెండు వారాల కలెక్షన్లు ఎంతంటే..

  Oct 07 | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం వాల్మీకి అలియాస్ గద్దలకొండ గణేష్.. మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం విడుదలైనా తన జోరును కొనసాగిస్తోంది. ప్రస్తుతం... Read more

 • Sye raa box office day 4 collection chiru s film mints rs 123 crore worldwide

  రూ.100 కోట్ల క్లబ్ లోకి మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’

  Oct 05 | మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన చారిత్రాక చిత్రం ‘సైరా’ విమర్శకులతో పాటు ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంది. చిరంజీవి నటశిఖరమని చలనచిత్ర పరిశ్రమకు చెందిన అగ్రహీరోలు, దర్శకులు కొనియాడుతున్నారు. మెగాస్టార్ నటవిశ్వరూపాన్ని ఈ... Read more

Today on Telugu Wishesh