First look of Niharika from Suryakantham మొగుణ్నిమొట్టే పాత్రలో నిహారిక.?

Niharika konidela s film suryakantham is about yin and yang

Suryakantham, Nikarika Konidela, Suryakantham movie, Suryakantham Telugu movie, Suryakantham movie news, Pranith Bramandapally, Nirvana Cinemas.Nikarika Konidela news, latest movie news, tollywood, movies, entertainment

Actor Niharika Konidela’s upcoming film Suryakantham’s first look poster was released by her brother Varun Tej Konidela

నిహారిక ‘సూర్యకాంతం’ నుంచి ఫస్ట్ లుక్

Posted: 12/18/2018 08:12 PM IST
Niharika konidela s film suryakantham is about yin and yang

'ఒక మనసు' వంటి సున్నితమైన ప్రేమకథా చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన నిహారిక, ఇటీవలే 'హ్యాపీ వెడ్డింగ్' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లోను చేసింది. అయితే ఈ సినిమా కూడా ఆదరణ పొందలేదు. ఈ నేపథ్యంలో ఆమె తదుపరి సినిమాగా 'సూర్యకాంతం' రూపొందుతోంది. రాహుల్ విజయ్ జోడీగా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది.

నిర్వాణ సినిమాస్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకి ప్రణీత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి నాయకా నాయికల ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. కథానాయకుడిని ఆరాధనా పూర్వకంగా చూస్తూ.. వున్నట్లుగా కనిపించే ఈ ఫస్ట్ లుక్ తిరగేస్తే.. మొగుణ్ని మొట్టే పాత్రలో నటిస్తుందా.? అంటే పెంకి పెళ్లాం పాత్రను పోషిస్తుందా.? లేక పెంకి ప్రియురాలి పాత్రలో మెరవనుందా.? అన్న విషయం తెలియాల్సి వుంది.

ఎందుకంటే నాణానికి ఓ వైపు అన్నట్లు హీరోను ఆరాధనా పూర్వకంగా చూసే ఆమె మరో వైపు హీరో జుట్టును పట్టుకుందా.? లేక మొట్టుతుందా.? అన్నది తేలకపోయినా మొత్తానికి టార్చర్ పెడుతూ ఈ పోస్టర్లో నిహారిక కనిపిస్తోంది. కొత్త సంవత్సరం ఆరంభంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో వున్నారు. ఆసక్తికరమైన టైటిల్ తో .. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న నిహారికకి ఈ సారైనా హిట్ పడుతుందేమో చూడాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suryakantham  Nikarika Konidela  Varun Tej  Rahul Vijay  tollywood  

Other Articles