#VVR Song: Thassadiyya, What An Energy! ‘వినయ విధేయ రామ’ నుంచి తస్సాదియ సాంగ్

Vvr song thassadiyya what an energy

Ram Charan, Kaira Advani, Thassadiyya song, VVR, Vinaya Vidheya Rama, devisri prasad, Dvv Danayya, movies, entertainment, tollywood

mega fans is right now waiting for this hyped 'Thassadiyya' song from upcoming film Vinaya Vidheya Rama that features Mega Powerstar Ram Charan and hottie Kiara Advani in the leads

రాంచరణ్ ‘వినయ విధేయ రామ’ నుంచి తస్సాదియ సాంగ్

Posted: 12/17/2018 08:15 PM IST
Vvr song thassadiyya what an energy

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కథానాయకుడిగా 'వినయ విధేయ రామ' రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో .. కుటుంబంలోని బంధాలు .. అనుబంధాలు ప్రధానంగా ఈ కథ సాగనుంది. యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కి పెద్దపీట వేస్తూ దర్శకుడు బోయపాటి ఈ సినిమా చేశాడు. ఇటీవల వదిలిన ఫస్టు సింగిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో కొంతసేపటి క్రితం రెండవ సింగిల్ ను రిలీజ్ చేశారు.

"రోమియో జూలియట్ మళ్లీ పుట్టినట్టు ఉంటదంటా మన జట్టు .. వాళ్ల కథలో క్లైమాక్స్ పాజిటివ్ గా రాసినట్టు .. మన లవ్ స్టోరీ హిట్టు .." అంటూ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట కొనసాగుతోంది. 'మోనలిసా నవ్వు .. సన్నజాజి పువ్వు ఒక్కటైతే నువ్వు' .. 'వేడివేడి లావా స్వీటు పాలకోవ ఒక్కటైతే నువ్వు' అనే పదప్రయోగాలు బాగున్నాయి. శ్రీమణి సాహిత్యం .. జస్ ప్రీత్ .. మనసి ఆలాపన  ఆకట్టుకుంటోంది. స్నేహా .. ప్రశాంత్ ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను మెప్పించేలా బోయపాటి చేసిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Kaira Advani  Vinaya Vidheya Rama  devisri prasad  Dvv Danayya  tollywood  

Other Articles

Today on Telugu Wishesh