tanish sunayana centered attraction on rangu pre-release event రంగు’ పూసుకున్న తనిష్.. సునయనా

Tanish deepti sunayana centered attraction on rangu pre release event

Rangu, peter lara, rowdy sheeter biopic, karthikeya, nalla swamy, deepti sunayana, amit, roll rida, deepti nallabothu, shyamala, sanjana, ganesh, samrat reddy, movies, entertainment, tollywood

Hero Tanish and fellow Big Boss contestant Deepti Suunayana were center of attraction on rangu pre-release event organised in hyderabad.

‘రంగు’ పూసుకున్న తనిష్.. సునయనా

Posted: 11/20/2018 06:24 PM IST
Tanish deepti sunayana centered attraction on rangu pre release event

తెలుగు చలనచిత్ర తెరపై ఇప్పుడు బయోపిక్ చిత్రాలకు ఆదరణ ఎక్కువైంది. ఒక సెలబ్రిటీ జీవితం గురించి పుస్తకాలు చదవడం.. వారి పరిచయస్థుల ద్వారా విషయాలను తెలుసుకోవడం.. లేక వారు రచించిన పుస్తకాల ద్వారా విషయాలను సంగ్రహించేంత సమయం లేదు ఈ తరం వారికి. అందుకనే సినిమాల ద్వరా రెండున్నర గంటల్లో వారి గురించి సాధ్యమైనంత తెలుసుకునేందుకు వేలం వెర్రిగా బయోపిక్ లను ఆదరిస్తున్నారు.

ఈ బయోపిక్ లలో ప్రముఖులతో పాటు క్రీడాకారులు, ఇతర రంగాలకు చెందిన వారి బయోపిక్ కూడా తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడ రౌడీ షీటర్ లారా బయెపిక్ కూడా తెరకెక్కింది. అతని జీవితంలో జరిగిన ముఖ్యమైన అంశాలను అతను రౌడీషీటర్ గా మారడానికి గల కారణాలను ఈ చిత్రంలో అసక్తికరంగా రూపోందించారు దర్శకుడు కార్తికేయ‌. న‌ల్లాస్వామి స‌మ‌ర్ప‌ణ‌లో యు అండ్ ఐ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై నిర్మించిన ఈ చిత్రంలో హీరో తనీష్ లారా పాత్రను పోషించాడు. ఈ చిత్రానికి ‘రంగు’ అని టైటిక్ కూడా ఫిక్స్ చేశారు.

ఈనెల చివరివారంలో (నవంబర్ 23న) విడుదలకు నోచుకోనున్న చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బిగ్ బాస్ 2 కంటెస్టెంట్లు ప్రత్యేక ఆకర్షణ. వారందిలో సునయనే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచింది. తనీష్ పక్కనే ఉంటూ అతని చేయిపట్టుకుని తెగ సందడి చేసింది. ఆమెతో పాటు నందిని, శ్యామల, సంజనా, గణేష్, అమిత్, రోల్ రైడా, సామ్రాట్ లు పాల్గొని ‘రంగు’ మూవీ ఆడియో లాంచ్ చేశారు. బిగ్ బాస్ ఇంట్లో తోటి సభ్యుడు తనీష్ కోసం వారు స్పెషల్ ఫెర్మార్మెన్స్‌ చేశారు. ‘ఎక్కడ ఉంది ఈ చిక్కుముడి’ అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి మరో ఆణిముత్యం జాలువారిందని కితాబిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rangu  peter lara  rowdy sheeter biopic  karthikeya  nalla swamy  deepti sunayana  tollywood  

Other Articles