ఫిదా లాంటి హిట్ చిత్రాన్ని అందుకున్నాక కొంత గ్యాప్ తీసుకున్న మెగా హీరో వరుణ్ తేజ్.. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపోందుతున్న 'అంతరిక్షం' సినిమా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ .. అదితీ రావు వ్యోమగాములుగా నటిస్తున్నారు. మరో కథానాయికగా లావణ్య త్రిపాఠి కూడా ఈ చిత్రంలో మెరవనుంది. అయితే ఇప్పటికే అంచనాలు పెరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించి.. తాజాగా టీజర్ ను విడుదల చేశారు.
టైటిల్ కి తగినట్టుగానే అంతరిక్షానికి సంబంధించిన సన్నివేశాలపై టీజర్ ను కట్ చేశారు. ప్రధానమైన పాత్రలపై కట్ చేసిన ఈ టీజర్ ద్వారా కథ చెప్పే ప్రయత్నం చేయకుండా, అందరిలో ఆసక్తిని పెంచడంలో టీమ్ సక్సెస్ అయింది. డిసెంబర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని వరుణ్ తేజ్ భావిస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more